Actor Daniel Balaji Passes Away: సినీ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది. తమిళ స్టార్ యాక్టర్ డేనియల్ బాలాజీ (48) కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెట్టయ్యాడు విలయాడు, వడ చెన్నైలోని తంబి అముధన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ డేనియల్ బాలజీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంబ, చిరుత, ఘర్షణ, టక్ జగదీష్ తదితర సినిమాల్లో మెప్పించాడు. కెరీర్లో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ పోషించారు. ఛాతీలో నొప్పి కారణంగా చెన్నైలోని కొట్టివాకంలోని ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచారు. శనివారం పురసైవల్కంలోని ఆయన నివాసంలో భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డేనియల్ బాలజీ మరణంపై తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
డేనియల్ బాలజీ 2001లో బుల్లితెరపై కెరీర్ ఆరంభించారు. సిద్ధి, అలయాల్ అనే సీరియల్స్‌లో యాక్ట్ చేశారు. ఆ తరువాత కాదల్ కొండేన్ మూవీలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పాత్రతో తమిళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు. కాక్క కాక్క, వడరు ఊదరావు, పొల్లాదవన్, వడచెన్నై, బిగిల్ వంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలు పోషించారు. ముఖ్యంగా వడ చెన్నై సినిమాలో ఆయన నటించిన 'తంబి' పాత్రకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి. అందులో లైప్ప తేలేఖితియెడ అనే పద్యం మూవీ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ సహా అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించారు. తెలుగు టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన విలనిజంతో మెప్పించారు.
డేనియల్ బాలజీకి దైవభక్తి ఎక్కువగానే ఉంది. చెన్నై సమీపంలోని ఆవడి ప్రాంతంలో రక్తల్ అంగళ పరమేశ్వరి అమ్మన్ ఆలయాన్ని ఆయన నిర్మించి.. గతేడాది సెప్టెంబర్‌లో కుంబాభిషేకం నిర్వహించిన విషయం తెలిసిందే. డేనియల్ బాలాజీ తన తల్లి కోరిక కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి కేజీఎఫ్ స్టార్ యష్ ఆర్థిక సాయం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో డేనియల్ బాలాజీ వెల్లడించారు. దివంగత నటుడు మురళికి డేనియల్ సోదరుడని చెబుతుంటారు.
Also Read: Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!
Also Read: Heat Waves: రానున్న 3-4 రోజుల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook