Allu Arjun on KGF 2: కేజీఎఫ్‌ 2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు.. పుష్పరాజ్‌ రివ్యూ ఇదే!

Allu Arjun heap praise on KGF Chapter 2. తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమా చుసిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వరుస ట్వీట్లు చేస్తూ చిత్ర బృందాన్ని పొగిడాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 08:00 PM IST
  • కేజీఎఫ్‌ 2 పెద్ద ప్రభంజనమే
  • కేజీఎఫ్‌ 2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు
  • పుష్పరాజ్‌ రివ్యూ ఇదే
Allu Arjun on KGF 2: కేజీఎఫ్‌ 2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు.. పుష్పరాజ్‌ రివ్యూ ఇదే!

Allu Arjun praises on Yash, Prashanth Neel movie KGF Chapter 2: ప్ర‌స్తుతం దేశమంతటా ఎక్క‌డ చూసినా.. విన్నా 'కేజీఎఫ్‌ చాప్టర్ 2' హ‌వానే న‌డుస్తుంది. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు క‌లెక్ష‌న్ల‌ సునామి  సృష్టిస్తోంది. ఏప్రిల్‌ 14న రిలీజైన కేజీఎఫ్‌ 2  అన్ని భాషల్లో సినిమా రికార్డులను బద్దలు కొట్టుకుంటూ పోతోంది. డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌, హీరో య‌ష్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సినిమా చుసిన ప్రతిఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమా చుసిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా వరుస ట్వీట్లు చేస్తూ చిత్ర బృందాన్ని పొగిడాడు. 

'కేజీఎఫ్‌ చాప్టర్ 2 చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు. సినిమాలో య‌ష్ స్వాగ్ ప‌ర్ఫామెన్స్, ఇంటెన్సిటీ అద్భుతంగా క‌నబ‌రిచాడు. సంజ‌య్‌ ద‌త్, ర‌వీనా టాంట‌న్‌, శ్రీనిధీ శెట్టిల‌ న‌ట‌న చాలా బాగుంది. ర‌వి బ‌స్రూర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అవుట్ స్టాండింగ్. సినిమాటోగ్రాఫ‌ర్ భువ‌న గౌడ వీజువ‌ల్స్ మరో స్థాయిలో ఉన్నాయి. సినిమా కోసం ప‌నిచేసిన ప్రతీ టెక్నీషియ‌న్‌కు నా తరఫున గౌర‌వ మ‌ర్యాద‌లు' అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్ చేశాడు.

'డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ విజ‌న్‌కు, క‌న్విక్ష‌న్‌కు నేను ఫిదా అయ్యా. సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు, భార‌తీయ సినిమా ప‌తాకాన్ని ఎగుర‌వేస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా' అని పాన్ ఇండియా స్టార్ అర్జున్‌ ట్వీట్ ఇంకో ట్వీట్ చేశాడు. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలు మాత్రమే దేశమంతటా ఆడేవి. ప్రస్తుతం దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి 1, బాహుబలి 2, కేజీఎఫ్‌ 1, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 పెద్ద ప్రభంజనమే సృష్టించాయి. 

ALso Read: Rajasekhar Jeevitha: 'రాజశేఖర్, జీవితలు మోసం చేశారు.. త్వరలోనే జైలుకు వెళతారు'

Also Read: Ranbir- Rashmika: మనాలీలో 'యానిమల్' టీం సందడి.. రణ్​బీర్, రష్మిక ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News