Samantha Yashoda Trailer : సమంత కోసం ఇంత మంది హీరోలు రెడీగా ఉన్నారా?.. వామ్మో క్రేజ్ అంటే ఇదే

Samantha Yashoda Trailer సమంత యశోద సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రాబోతోన్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 05:07 PM IST
  • నవంబర్‌లో రాబోతోన్న సమంత సినిమా
  • రేపే యశోద మూవీ ట్రైలర్
  • సూర్య, దుల్కర్, రక్షిత్ శెట్టిలతో ట్రైలర్
Samantha Yashoda Trailer : సమంత కోసం ఇంత మంది హీరోలు రెడీగా ఉన్నారా?.. వామ్మో క్రేజ్ అంటే ఇదే

Samantha Yashoda Trailer : సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె సర్జరీ రూమర్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే వాటిలో ఎంత నిజముందో సమంతకే తెలియాలి. కానీ సమంత మొహంలో మాత్రం చాలా మార్పులు వచ్చినట్టు ఇట్టే కనిపిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. సమంత తన యశోద సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయింది. అందుకే ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు యశోద కోసం యాక్టివ్ అయింది.

సమంత ప్రస్తుతం యశోద సినిమా కోసం తన కాంటాక్ట్‌లను వాడుతున్నట్టు కనిపిస్తోంది. సమంత తనకు క్లోజ్ ఫ్రెండ్స్ కమ్ స్టార్ హీరోలైనా వారిని రంగంలోకి దించేందుకు ట్రై చేస్తోంది. యశోద సినిమాను దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో రిలీజ్ చేయించేందుకు రెడీ అయింది.

సూర్యతో తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేయిస్తుంది సమంత. సూర్యతో గతంలోనే సమంత సినిమాల్లో నటించింది. ఆ స్నేహం ఇప్పుడు కలిసి వచ్చింది. ఇక రక్షిత్ శెట్టి ఛార్లీ సినిమాతో ట్రెండింగ్‌లోకి రావడంతో కన్నడ ట్రైలర్‌ను అతడితో విడుదల చేయిస్తోంది. వరుణ్‌ ధావన్‌తో సమంతకు మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే హిందీ ట్రైలర్‌ను అతగాడితో విడుదల చేయిస్తోంది.

ఇక మలయాళం ట్రైలర్‌ను దుల్కర్ సల్మాన్ విడుదల చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేస్తాడని తెలుస్తోంది. మొత్తానికి సమంత యశోద మాత్రం ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేయాలని చూస్తోంది.

ఈ చిత్రం వచ్చే నెల అంటే నవంబర్ 11న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా సమంతకు కావాల్సిన పాన్ ఇండియన్ స్టార్డంను ఇస్తుందా? ఆ రేంజ్‌లో హిట్ అవుతుందా? అన్నది చూడాలి. ఈ చిత్రం తరువాత సమంత శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కూడా రెడీ అవుతోంది.

Also Read : Allu Sneha Reddy Video : అదరహో అనిపించేలా అల్లు స్నేహారెడ్డి.. అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోన్న బన్నీ భార్య

Also Read : Bigg Boss Geetu : అందుకే గీతూకి గెలిచే అర్హత లేదనేది.. బిగ్ బాస్ హిస్టరీలోనే వరెస్ట్ కంటెస్టెంట్‌?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News