Mahesh_Trivikram Movie: త్రివిక్రమ్-మహేశ్ సినిమా మరింత ఆలస్యం, కారణం ఆమెనేనా

Mahesh_Trivikram Movie: సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా మరింత ఆలస్యం కానుంది. త్వరలో రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆలస్యానికి కారణం ఎవరో తెలుసా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2022, 01:17 AM IST
Mahesh_Trivikram Movie: త్రివిక్రమ్-మహేశ్ సినిమా మరింత ఆలస్యం, కారణం ఆమెనేనా

సర్కారువారిపాట తరువాత మహేశ్ బాబు అప్‌కమింగ్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. 

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నత ఈ సినిమాపై ఇప్పట్నించి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా వరుసగా ఐదు భాషల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాను హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. 

ఇటీవలే హైదరాబాద్ అన్నపూర్ణ స్డూడియోస్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. రెండవ షెడ్యూల్ షూటింగ్ త్వరలో షూట్ కానుంది. ఈ సినిమాను ఏప్రిల్ 28, 2023న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించినా..మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే కారణంగానే షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఆమె కాలికి గాయమై..ఇంకా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన నేపధ్యంలో నవంబర్ నెలలో ప్లాన్ చేసిన షూటింగ్ డిసెంబర్ నెలకు వాయిదా పడింది. 

అంటే మహేశ్ బాబు రెడీగా ఉన్నా..పూజా హెగ్జే మాత్రం ఇంకా సన్నద్ధంగా లేదు. పూజా హెగ్డే సిద్ధమయ్యేంతవరకూ ఇతర భాగాల షూటింగ్ పూర్తి చేసే ఆలోచన కూడా ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు..తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస సినిమా హీరోయిన్ గీతిక తివారికి అవకాశం లభించిందట.

ఖలేజా తరువాత దాదాపు 12 ఏళ్లకు త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ సినిమా ఇది. ఇప్పట్నించే సినిమా ఓవర్‌సీస్ రైట్స్, ఓటీటీ రైట్స్ కోసం చర్చలు సాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల డిజిటల్ రైట్స్‌పై మాటలు సాగుతున్నాయి. ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also read: Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News