Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) కు ఉన్న క్రేజ్ ఇంకెవ్వరికీ ఉండదు. ఆయనంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇటు సాధారణ ప్రేక్షకులతోపాటు.. లేడీస్ ఫాలోయింగ్ విషయంలో మహేష్‌కు ‘సరిలేరు నీకెవ్వరు’ అనాల్సిందే.

Last Updated : Aug 8, 2020, 07:43 AM IST
Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి

Mahesh Babu Birthday: టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) కు ఉన్న క్రేజ్ ఇంకెవ్వరికీ ఉండదు. ఆయనంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇటు సాధారణ ప్రేక్షకులతోపాటు.. లేడీస్ ఫాలోయింగ్ విషయంలో మహేష్‌కు ‘సరిలేరు నీకెవ్వరు’ అనాల్సిందే. ఈ క్రమంలో మ‌హేష్ - ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న స‌ర్కారు వారి పాట ( Sarkar vaari paata ) సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. Also read: Mahesh Babu: మహేష్ బాబు హీరోయిజంకు 21 ఏళ్లు

ఇదిలా ఉంటే.. ఆగ‌స్టు 9న అంటే రేపటితో మ‌హేష్  బాబు 45వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ మ‌హేష్ బ‌ర్త్‌ డే ( Mahesh Babu Birthday ) వేడుక‌లను ఘ‌నంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ త‌న అభిమానుల‌కు లేఖ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజు వేడుక‌లకు దూరంగా ఉంటూ ఇంట్లోనే క్షేమంగా ఉండాల‌ని ఆయన కోరారు. 

‘‘ప్రియ‌మైన అభిమానులారా, మీరంతా నాకు తోడుగా ఉండ‌డం నా అదృష్టం. నా పుట్టిన రోజు, ఒక ప్ర‌త్యేక‌మైన రోజుగా గుర్తుండాల‌ని మీరు చేస్తున్న మంచి ప‌నుల‌కి చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం క‌రోనా (Coronavirus) తో మ‌నమంద‌రం చేస్తున్న యుద్ధంలో సుర‌క్షితంగా ఉండ‌డం అన్నింటిక‌న్నా ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులంతా వేడుక‌లకి దూరంగా ఉండి క్షేమంగా ఉండాలి’’ అని మహేష్ బాబు కోరారు. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఇలా ఓ లేఖను విడుదల చేయడంతో ఫాన్స్ అంతా ఆయన్ను సరిలేరు నీకెవ్వరు అంటూ అభినందిస్తున్నారు.  Also read: Mahesh Babu: సర్కార్ వారి పాట.. ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌కి గురిచేస్తోన్న పోస్టర్‌

Trending News