Guntur Kaaram Pre-release Event: కొత్త మహేష్‌ బాబును చూడబోతున్నారు.. కారణం ఆయనే.. సూపర్ స్టార్ ఎమోషనల్ స్పీచ్

Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్ హైలైట్ గా నిలిచింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 09:11 PM IST
Guntur Kaaram Pre-release Event: కొత్త మహేష్‌ బాబును చూడబోతున్నారు.. కారణం ఆయనే.. సూపర్ స్టార్ ఎమోషనల్ స్పీచ్

Mahesh Babu Speech at Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ముచ్చటగా మూడోసారి హీరోగా చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు గుంటూరులో ఘనంగా జరిపారు.

ముందుగా ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ మహేష్ బాబు ఈ సినిమా కలెక్షన్స్ తో తాట తీస్తారు అని ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచారు. ఆ తరువాత శ్రీలీల మాట్లాడుతూ మహేష్ బాబు గురించి తన ఇంట్లో వాళ్ళు అడిగితే.. బంగారు విగ్రహానికి ప్రాణం పోసినట్టు ఆయన ఉంటారని చెప్పా అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనని తెలుగులో లాంచ్ చేసిన రాఘవేంద్రరావు గారుని తలుచుకుంటూ.. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఈ సినిమాతో తనని రీ-లాంచ్ చేశారు అని కామెంట్స్ చేసింది. ఆ తరువాత త్రివిక్రమ్ మాట్లాడుతూ మహేష్ బాబు 100 శాతానికి రెండు వందల శాతం ఇచ్చే యాక్టర్ అని మహేష్ బాబుని తెగ పొగిడేశారు.

ఇక ఫైనల్ గా మైక్ అందుకున్న మహేష్ బాబు తన స్పీచ్ తో అదరగొట్టారు.’త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు కుటుంబ సభ్యుడితో సమానం. అందుకే నేను ఆయన గురించి పెద్దగా మాట్లాడను. ఆయనతో ఎప్పుడు పని చేసినా నా పర్ఫార్మెన్స్ లో ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటాను. ఈ సినిమా తో కూడా అదే జరిగిందని నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమా తో కొత్త మహేష్ బాబు ని చూడబోతున్నారు అందరూ. సంక్రాంతి నాకు కలిసొచ్చే పండుగ అయినప్పటికీ ఈ సారి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటె నాన్న గారు లేకపోవడమే! ప్రతీ సారి ఆయన నా సినిమా చూసొచ్చి వాటి కలెక్షన్స్ గురించి మాట్లాడే వారు. కానీ ఈ సారి ఆయన నుంచి నాకా ఫోన్ కాల్ రాదు. కానీ మీ అందరూ నాకు చెప్పండి. ఇక నుంచి అమ్మైనా, నాన్నైనా మీరే. మీరే నా సర్వస్వం’.. అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. 

Also read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..

Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News