Super Star Krishna: కృష్ణ దశ దిన కర్మకు 40 రకాల వంటలు.. అభిమానుల కోసం స్పెషల్ విందు!

Super Star Krishna Dasha dina Karma : కుటంబ సభ్యల అశ్రు నయనాలు, అభిమానుల ఒదార్పుల మధ్య సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ జరిగింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే   

Last Updated : Nov 27, 2022, 06:59 PM IST
Super Star Krishna: కృష్ణ దశ దిన కర్మకు 40 రకాల వంటలు.. అభిమానుల కోసం స్పెషల్ విందు!

Super Star Krishna Dasha dina Karma Lunch Menu: తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ మరణం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఆయన వరించి చాలా రోజులు గడుస్తున్నా ఆయన మరణాన్ని మాత్రం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారంటే ఆయన ఎంతగా అభిమానిస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 350 సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో కన్ను మూసారు.

ఇక ఆయన పెద్దకర్మ ఈరోజు హైదరాబాద్ లో జరిపారు కుటుంబ సభ్యులు. నానక్ రామ్ గూడలోని విజయకృష్ణ నివాసంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత హైదరాబాద్ లో రెండు ప్రాంతాలలో అతిథుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. ఘట్టమనేని కుటుంబ అభిమానుల కోసం జేఆర్సి కన్వెన్షన్ లో ఏర్పాట్లు చేయగా సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులకు ఇతర సెలబ్రిటీలకు హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ లో భోజన ఏర్పాట్లు చేశారు.

ఇక అభిమానుల కోసం జేఆర్సి సెంటర్ కు మహేష్ బాబు సుధీర్ బాబు వంటి వారు హాజరై అభిమానులందరికీ ధైర్యం చెప్పడమే కాక కాస్త ఎమోషనల్ అవుతూ కూడా వారితో మాట్లాడారు. ఇక అభిమానులకు వడ్డించిన వంటకాలు వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుమారు 40 రకాల వంటకాలు కృష్ణ అభిమానులకు మహేష్ బాబు అభిమానులకు ఇక్కడ వడ్డించినట్లు తెలుస్తోంది. మొఖంలో సుమారు 5000 మందికి పాసులు జారీ చేయగా ఎనిమిది వేల మంది దాకా అభిమానులు అక్కడికి వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అయితే ఎక్కువ మంది వస్తారని ముందుగానే ఊహించిన మహేష్ కుటుంబ సభ్యులు వారందరికీ తగినట్లుగానే భోజనం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక అక్కడి ఫోటోలు వీడియోలు తీసిన అభిమానులు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి తమ అభిమాన హీరో మంచి మనసును గుర్తు చేసుకుంటున్నారు. 
 Also Read: Ram Charan : ఆ కథకే చరణ్ గ్రీన్ సిగ్నల్.. 'వృద్ధి' రంగంలోకి.. రేపే అనౌన్సమెంట్?

Also Read: HIT 2 Business: దుమ్ము రేపిన హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్.. శేష్ కెరీర్లోనే హయ్యెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News