Gadar 2 Telugu Version: ఓటీటీలోకి ‘గదర్‌ 2’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పడు, ఎక్కడంటే?

Gadar 2 OTT: ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రాల్లో సన్నీ డియోల్ గదర్ 2 ఒకటి. తాజాగా ఈ మూవీ ఓటీటీ తెలుగు వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 04:44 PM IST
Gadar 2 Telugu Version: ఓటీటీలోకి ‘గదర్‌ 2’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పడు, ఎక్కడంటే?

Gadar 2 Telugu Version OTT Release Date: ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో చిత్రాల్లో గదర్ 2(Gadar 2 Movie) ఒకటి.  సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ పఠాన్, జవాన్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సుమారు రూ. 600 కోట్లు వసూళ్లు సాధించింది. 1971లో భారత్, పాకిస్థాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైంది. 

ప్రస్తుతం ఈ మూవీ హిందీ వెర్షన్ జీ5లో  స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే తాజాగా తెలుగు ఆడియెన్స్ కోసం గదర్ 2 తెలుగు వెర్షన్‌ను కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్‌ 1) నుంచి ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ ఫామ్ బుక్‌ మై షో స్ట్రీమింగ్‌ యాప్‌లో గదర్‌ 2 తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది.

గదర్‌ 2 సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించగా.. ఉత్కర్ష్‌ శర్మ, గౌరవ్ చోప్రా, మనీష్‌ వాద్వా, మనోజ్‌ భక్షి, ఆర్యా శర్మ, సిమ్రత్‌ కౌర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. గదర్ 2 సూపర్ బ్లాక్ బస్టర్ అవడంతో గదర్ 3 కూడా రాబోతున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. సన్నీ డియోల్ ఈ విషయాన్ని ధృవీకరించినా.. ఎప్పటి నుంచి మొదలవుతుందన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

Also Read: Rules Ranjan OTT: ఇవాళే ఓటీటీలోకి రూల్స్ రంజన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News