Sukesh Chandrashekar Nora Fatehi మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటీమణులను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. సుఖేష్, జాక్వెలిన్ రొమాంటిక్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వాటిపై జాక్వెలిన్ సైతం మండి పడింది. తన గురించి మీడియాలో ఇష్టమొచ్చినట్టుగా రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాక్వెలిన్‌కు సుఖేష్ అత్యంత విలాసమైన విల్లాను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి.
ఇక సుఖేష్ కేసులో నోరా ఫతేహిని సైతం ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈడీ ముందు నోరా చెప్పిన విషయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనకు సుఖేష్‌తో అంతగా పరిచయం లేదని, ఆయన భార్య పిలిస్తే ఒకసారి ఈవెంట్‌కు వెళ్లానని, అక్కడే ఓ గిఫ్ట్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది నోరా ఫతేహి. కానీ ఇప్పుడు సుఖేష్ చెప్పిన విషయాలు విని అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
నోరా ఫతేహి తనకు రోజుకు పది సార్లు ఫోన్ చేసేదని, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలా చేస్తూనే ఉండేదని నోరా గురించి సుఖేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఆమెకు జాక్వెలిన్ అంటే జెలసీ అని, జాక్వెలిన్‌ను వదిలేసి తనతో డేటింగ్ చేయమని నోరా కోరేదట. మొత్తానికి నోరా మాత్రం తనకు బ్రెయిన్ వాష్ చేస్తుండేదని సుఖేష్ చెప్పుకొచ్చాడట.
ప్రస్తుతం నోరా ఫతేహి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. సుఖేష్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు నోరా, జాక్వెలిన్ మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి అందరికీ అర్థమైంది. సుఖేష్ చెప్పిన మాటలతో అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్టు అయింది.
Also Read: Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే
Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి