Priyanka Chopra Daughter Photo: స్టార్ కపుల్ ప్రియాంక చోప్రా-నికో జోనస్ ఎట్టకేలకు తమ కూతురి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో రివీల్ చేశారు. అయితే తమ గారాల పట్టి ముఖం కనిపించకుండా కవర్ చేసేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి పాపాయికి సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ప్రియాంక దంపతులు ఎందుకింత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారని చాలామంది భావించారు. కానీ అసలు కారణమేంటంటే... ఇన్నాళ్లు ఆ పాపాయి ఎన్ఐసీయూ(నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చికిత్స అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు.
బిడ్డ పుట్టిన దాదాపు 100 రోజులకు మదర్స్ డే (మే 8) రోజున ప్రియాంక దంతులు తమ కూతురిని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. లాస్ ఏంజిల్స్‌లోని రాడీ చిల్డ్రన్ ఆసుపత్రిలో తమ పాపాయికి చికిత్స అందించిన ప్రతీ వైద్యుడికి, నర్సులకు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేశారు. మదర్స్ డే రోజున తమ కూతురు ఇంటికి చేరడంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రియాంక... కొన్నాళ్లుగా తాము అనుభవిస్తున్న ఒడిదుడుకుల గురించి ఆలోచించకుండా ఉండలేమని అన్నారు. ఈ కొద్ది నెలల సమయంలో ఎదురైన సంక్లిష్ట పరిస్థితులు ప్రతీ క్షణం ఎంత విలువైనదో స్పష్టం చేశాయన్నారు.
ప్రియాంక దంపతులు తమ కూతురికి 'మాల్టీ మేరీ చోప్రా జోనస్' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల పేర్లు కలిసొచ్చేలా కూతురికి ఈ పేరు పెట్టుకున్నారు. సినిమాల విషయానికొస్తే... ప్రియాంక చోప్రా నటించిన 'శీలా', 'కల్పనా చావ్లా' సినిమాలు ఈ ఏడాది డిసెంబర్లోప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ప్రియాంక నటిస్తున్న 'జీ లే జరా' మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: CSK vs DC: ఛాంపియన్‌లా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్‌పై ఘన విజయం
Also Read: Sarkaru Vaari Paata: మహేష్ 'సర్కారు వారి పాట' జోరు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook