SSMB28 Update: మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Mahesh Babu And Trivikram Srinivas Upcoming Movie SSMB28 Update. మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) తెరకెక్కనున్న విష‌యం తెలిసిందే.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 07:41 PM IST
  • మ‌హేశ్ బాబు-త్రివిక్ర‌మ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్
  • షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా?
  • యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఎస్ఎస్ఎంబీ 28
SSMB28 Update: మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Mahesh Babu And Trivikram Srinivas Upcoming Movie SSMB28 to start from July: సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేష‌న్‌లు ఉంటాయి. ఆ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయి. టాలీవుడ్‌లో అలాంటి అద్భుతమైన కాంబినేషన్ సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు రెండు సినిమాలు చేశారు. 2005లో వచ్చిన అతడు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలవగా.. 2010లో వచ్చిన ఖలేజా సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు మూడోసారి మ‌హేశ్-త్రివిక్ర‌మ్ జోడీ కలిసి పనిచేయబోతోంది. 

మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) తెరకెక్కనున్న విష‌యం తెలిసిందే. మహేష్ అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్ రానే వ‌చ్చింది. ఇటీవ‌లే కుటుంబంతో కలిసి జ‌ర్మ‌నీ వెకేష‌న్‌కు వెళ్లిన సూపర్ స్టార్‌ను క‌లిసి స్టోరీ చెప్పాడట మాటల మాంత్రికుడు. మ‌హేశ్ కూడా ఒకే అనడంతో షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. 

తాజా స‌మాచారం ప్ర‌కారం జులై నుంచి ఎస్ఎస్ఎంబీ 28 చిత్రీక‌ర‌ణ మొద‌లుకానుందట. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా త్రివిక్ర‌మ్ ఫిక్స్ చేశాడ‌ట. మ‌హేశ్ బాబు జ‌ర్మ‌నీ నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఈ సినిమా ప్రాజెక్టుపై ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్ట‌నున్నాడ‌ట. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వరలో తెలియనున్నాయి. త్రివిక్రమ్, మహేష్ చేయబోయేది అతడు సీక్వెల్ అనే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే. 

మే 12న మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన 'సర్కారు వారి పాట' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబుకి సరైన కంటెంట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో ఎస్‌వీపీ నిరూపించింది. ప్రస్తుతం మ‌హేశ్ ఎస్‌వీపీ సినిమా స‌క్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే జోష్‌లో త్రివిక్ర‌మ సినిమా మొద‌లుపెట్టి అభిమానుల‌ను ఖుషీ చేయనున్నాడు. 

Also Read: Vastu Tips for Home Cleaning: ఇంటిని ఇలా శుభ్రం చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది!

Also Read: IND Vs SA: రాహుల్ ద్రవిడ్‌ను ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్.. ఉమ్రాన్‌ మాలిక్‌ కంటే ముందే అరంగేట్రం..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News