SSMB28 Shooting Update: ఆ సీన్‌తోనే SSMB28 షూటింగ్ ఆరంభం.. కసరత్తులు మొదలెట్టిన మ‌హేశ్ బాబు!

Mahesh Babu, Trivikram Srinivas movie SSMB28 Shooting Update. తాజాగా SSMB28 సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 1, 2022, 04:01 PM IST
  • ఆ సీన్‌తోనే SSMB28 షూటింగ్ ఆరంభం
  • కసరత్తులు మొదలెట్టిన మ‌హేశ్ బాబు
  • మ‌హేశ్-త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో మూడో సినిమా
SSMB28 Shooting Update: ఆ సీన్‌తోనే SSMB28 షూటింగ్ ఆరంభం.. కసరత్తులు మొదలెట్టిన మ‌హేశ్ బాబు!

Mahesh Babu, Trivikram Srinivas movie SSMB28 Shooting starts with Fight Scene: సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేష‌న్‌లో మూడో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే అత‌డు, ఖ‌లేజా సినిమాలు రాగా.. తాజాగా SSMB28 (వర్కింగ్ టైటిల్) వస్తోంది. ఈ సినిమా ప్ర‌క‌ట‌న 2022 ఆరంభంలోనే  వ‌చ్చింది. ఇప్ప‌టికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబ‌ర్‌లో SSMB28 షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు త‌న పాత్ర కోసం క‌స‌ర‌త్తులు మొదలెట్టారు.

తాజాగా SSMB28 సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఆరంభం కానుందని సమాచారం తెలుస్తోంది. బ‌స్ ఫైట్ సీక్వెన్స్‌తో SSMB28 షూటింగ్ స్టార్ట్ అవుందట. ఇప్ప‌టికే ఈ ఫైట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతుంద‌ని బోగట్టా. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

SSMB28 సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుకి జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ ఇద్దరు మహర్షి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంకు ఎస్‌.ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. SSMB28ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల కానుంది. మ‌హేశ్-త్రివిక్రమ్ కాంబో కాబట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: SKY Batting Secret: బహుశా నా బ్యాటింగ్ సీక్రెట్‌ అదేనేమో.. స్నేహితులతో కలిసి..!

Also Read: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ‌.. టాప్‌లో ఎంఎస్ ధోనీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News