SSMB 28 : నిర్మాతకు జర్నలిస్ట్‌కు మాటల యుద్దం.. తగ్గేదేలే అంటోన్న నాగవంశీ

SSMB 28 Producer Naga Vamsi నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే నాగ వంశీ చేసే కామెంట్లు, చూపించే యాటిట్యూడ్ ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా నాగవంశీకి ఓ మీడియా ప్రతినిధికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 03:01 PM IST
  • మహేష్ త్రివిక్రమ్ మూవీపై చర్చలు
  • నిర్మాతకు మీడియా ప్రతినిధికి కోల్డ్ వార్
  • మహేష్‌ బాబు ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
SSMB 28 : నిర్మాతకు జర్నలిస్ట్‌కు మాటల యుద్దం.. తగ్గేదేలే అంటోన్న నాగవంశీ

SSMB 28 Producer Naga Vamsi సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన చేసే కామెంట్లు, చూపించే యాటిట్యూడ్ మీద ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఎవరు ఏమన్నా కూడా తాను అనుకున్నది ముక్కుసూటిగా చెబుతూ వెళ్తుంటాడు నాగవంశీ. అయితే ఇప్పుడు తమ సినిమా మీద ఓ మీడియా సంస్థ రాసిన ఆర్టికల్స్, ప్రచారం చేస్తున్న గాసిప్స్ మీద మండి పడ్డాడు. అయితే నిర్మాత వేసిన కౌంటర్లకు సదరు మీడియా ప్రతినిధి సైతం సెటైర్లు వేశాడు.

ఇలా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అసలు మ్యాటర్ ఏంటో ఓ సారి చూద్దాం. మహేష్‌ బాబు అసంతృప్తితో ఉన్నాడని, త్రివిక్రమ్ వర్క్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం లేదని, షూటింగ్‌ విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం లేదని, అందుకే మహేష్ బాబు సమ్మర్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకున్నాడని సదరు మీడియా ప్రతినిధి చెప్పుకొచ్చాడు.

దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించాడు. పక్షులు ఆకలి వేసినప్పుడు అరుస్తాయి.. ఇలా కొందరు దృష్టిని మరల్చుకోవడానికి రూమర్లను స్ప్రెడ్ చేస్తుంటాయి.. వాళ్లని అలా వదిలేయడం సులభమే లేదంటే.. వాళ్లని చూసి ఓ చిన్న నవ్వు నవ్వుకుని వదిలేయోచ్చు.. ఈ సినిమా కచ్చితంగా అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా సెలెబ్రేట్ చేసుకునేలా ఉండబోతోంది.. ఈ మాట మాత్రం గుర్తు పెట్టుకోండి అని నాగవంశీ అన్నాడు.

Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్

దీంతో సదరు మీడియా ప్రతినిధి స్పందించాడు. కవిత్వం సరే.. బాగానే ఉంది.. కానీ క్లారిటీ.. కదలిక.. కార్యాచరణ.. అది కదా కీలకం అని అన్నాడు. దానిపై నిర్మాత మళ్లీ స్పందించాడు. ఇలాంటి రూమర్లను రాయడం వల్ల ఇండస్ట్రీకే లాభం.. మేం ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నాం.. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని తీస్తున్నాం.. మా మాటలను గుర్తు పెట్టుకోండి.. మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా వస్తుంది.. ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ అందరికీ నచ్చింది.. మే 31న అదిరిపోయే అప్డేట్‌తో రాబోతోన్నాం.. ఈ స్టేట్మెంట్‌లో ఎలాంటి పొయెట్రి లేదు అని చురకలు అంటించాడు.

Also Read:  Samantha Health : మళ్లీ హాస్పిటల్‌లో చేరిన సమంత.. ఆ ఫోటోతో పుట్టుకొచ్చిన అనుమానాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News