Sridevi Sobhan Babu Teaser: సమంత చేతుల మీదుగా 'శ్రీదేవి శోభన్ బాబు' టీజర్!

Sridevi Sobhan Babu Teaser: మెగాస్టార్ తనయ సుస్మిత కొణిదెల నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్రం 'శ్రీదేవి శోభన్ బాబు'. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 09:36 AM IST
Sridevi Sobhan Babu Teaser: సమంత చేతుల మీదుగా 'శ్రీదేవి శోభన్ బాబు' టీజర్!

Sridevi Sobhan Babu Teaser: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా రూపొందించిన చిత్రం 'శ్రీదేవి శోభన్ బాబు'. స్టార్ హీరోయిన్ స‌మంత చేతుల మీదుగా గురువారం ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యింది. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే..

హీరో సంతోష్ శోభ‌న్ .. శోభ‌న్ పాత్ర‌లో, గౌరి జి కిష‌న్.. శ్రీదేవి పాత్ర‌లో న‌టించారు. ఈ రెండు పాత్ర‌లు ఓ ఇంటి విష‌యంలో స‌ద‌రు ఇల్లు నాదంటే నాదేన‌ని గొడ‌వ ప‌డ‌తార‌ు. టీజ‌ర్‌లో పాత్ర‌ల‌ను రేడియో వార్త‌ల‌ను చ‌దువుతున్న కోణంలో ప‌రిచ‌యం చేస్తూ వ‌చ్చారు. ఇది కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది. అస‌లు శ్రీదేవి - శోభ‌న్‌బాబు మ‌ధ్య గొడ‌వ ఇంటి గురించేనా!  మ‌రి ఇంకేదైనా ఉందా! అనేది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే..

బుధ‌వారం టీజ‌ర్ రిలీజ్‌ను హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. ప్రెస్ మీట్‌లో టీజ‌ర్‌ను సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల‌ మాట్లాడుతూ.. "మా సంస్థ‌కు 'శ్రీదేవి శోభ‌న్‌బాబు' సినిమా చాలా స్పెష‌ల్‌. ఇంటి ప‌క్క‌న ఓ కాఫీ షాప్‌లో ఈ క‌థ మొద‌లైంది. అక్క‌డే డైర‌క్ట‌ర్ ప్ర‌శాంత్‌గారిని క‌లిశాను. అంద‌రం క‌లిసి ఫ్యామిలీ వెకేష‌న్‌కి వెళ్లిన‌ట్టు వెళ్లి షూటింగ్ చేసుకుని వ‌చ్చాం. మా నాన్న‌గారికి ఫస్ట్ సినిమా ఒక ఆఫ‌ర్‌లాగా వ‌చ్చి, ఆయన్ని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది. అలాంటి ఆప‌ర్‌చ్యూనిటీ నాకు శ్రీదేవి శోభ‌న్‌బాబు. మీ అంద‌రి స‌పోర్ట్, బ్లెస్సింగ్స్, కో ఆప‌రేష‌న్ కావాలి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల చేస్తాం. క‌మ్ర‌న్ సంగీతం బాగా కుదిరింది. లీడ్ పెయిర్ మ‌ధ్య క్యూట్ ఎమోష‌న్స్ బాగా కుదిరాయి. సిద్ధు మా ఫంక్ష‌న్‌కి రావ‌డం ఆనందంగా ఉంది. మా బాబాయ్ నాగ‌బాబుగారు స్పెష‌ల్ రోల్ చేశారు. రోహిణిగారు కూడా ప్ర‌త్యేక పాత్ర చేశారు" అని అన్నారు.

ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ.. "సుస్మిత‌, విష్ణు చేస్తున్న‌ తొలి సినిమా వేదిక మీద నేనుండ‌టం ఆనందంగా ఉంది. టీమ్ అంద‌రికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైన్ కూడా సుష్మిత‌గారే చేశారు. ఈ సినిమాకు టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి చేశార‌ని అర్థ‌మైంది. టీజ‌ర్ చాలా క్యూట్‌గా ఉంది. సంతోష్ చాలా బావున్నాడు. గౌరీ చాలా కొత్త‌గా క‌నిపించారు" అని అన్నారు.

Also Read: Thalapathy 66 Movie: ఇప్పుడు విజయ్ తో ఏం కావాలంటే అది చేయోచ్చు: రష్మిక

Also Read: Ghani Movie Review: గని మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్టు కొట్టాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News