Samajavaragamana: శ్రీవిష్ణు ‘సామజవరగమన’ కలెక్షన్ల సునామీ.. తొలి వారం ఎంత వసూలు చేసిందంటే?

Samajavaragamana: ఇటీవల కాలంలో సైలెంట్ గా వచ్చి భారీ హిట్ కొట్టిన సినిమా 'సామజవరగమన'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2023, 05:37 PM IST
Samajavaragamana: శ్రీవిష్ణు ‘సామజవరగమన’ కలెక్షన్ల సునామీ.. తొలి వారం ఎంత వసూలు చేసిందంటే?

Samajavaragamana 1st week box Office Collections: టాలీవుడ్‌లో పూర్తిస్థాయి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేస్తూ రీసెంట్ గా థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న సినిమా 'సామజవరగమన'. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫస్ట్ వీక్‌లో వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ. 30.1 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తన సినిమాను ఇంతలా అదరణించిన తెలుగు ప్రేక్షకులకు హీరో శ్రీవిష్ణు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవిష్ణు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

చాలా రోజులగా హిట్ లేని శ్రీవిష్ణు ఈ సినిమా ద్వారా ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాపై రవితేజ,  అల్లు అర్జున్‌ వంటి స్టార్ హీరోలు ప్రశంసలు వర్షం కురిపించారు. అంతేకాకుండా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాకు ఫ్యామిలీ అడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. డైరెక్టర్ రామ్‌ అబ్బరాజు ‘సామజవరగమన’ స్టోరీని మెుదట చెప్పింది శ్రీవిష్ణు కాదట. తొలుత హీరో సందీప్ కిషన్ కు చెప్పారట. అయితే మైఖేల్ మూవీతో సందీప్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లోకి శ్రీవిష్ణు వచ్చాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.

Also Read: JAILER: సూపర్ స్టార్ స్టైల్.. తమన్నా డ్యాన్స్... అదిరిపోయిన 'జైలర్' ఫస్ట్ సాంగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News