Pawan Kalyan Birthday: ఓ తెలుగు నటుడికి అంత క్రేజా..! ఆయన పుట్టినరోజుకీ ఏకంగా అమెరికాలో స్పెషల్ హాలిడే?

Pawan Kalyan Birthday: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 06:03 PM IST
Pawan Kalyan Birthday: ఓ తెలుగు నటుడికి అంత క్రేజా..! ఆయన పుట్టినరోజుకీ ఏకంగా అమెరికాలో స్పెషల్ హాలిడే?

Pawan Kalyan Birthday: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వేరు. రంజీవి సోదరుడిగా వెండితెరకు పరిచయమైనా తనదైన నటన, స్టైల్‌, మేనరిజం, ఫైట్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్‌కల్యాణ్‌. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. 

తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు(Pawan Kalyan Birthday) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల లోని పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా(Social Media) వేదికగా తమ అభిమాన నటుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పలు సినిమాలలోని ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ పవర్ స్టార్(power star) కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తెలుగువారు పవన్ కళ్యాణ్I(Pawan Kalyan) పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణమే. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకు ఏకంగా అమెరికాలో సెలవు దినంగా ప్రకటించడం గమనార్హం. తెలుగు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలోని బీకే ఐటీ సొల్యూషన్స్(BK IT Solutions) అనే కంపెనీ తమ ఆఫీసుకి సెలవును ప్రకటించడమే కాకుండా వేర్ హౌస్ లో పనిచేసే వారికి పవన్ పుట్టినరోజుకు హాలిడే ప్రకటించింది.

Also Read: Bheemla Nayak Title Song: "భీం భీం భీం.. భీమ్లా నాయక్".... అదిరిపోయిన టైటిల్ సాంగ్!

ఈ సందర్భంగా బీకే ఐటీ సొల్యూషన్స్ డైరెక్టర్ బాలు రెడ్డి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కు తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్లు ట్వీట్(Tweet) చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఒక టాలీవుడ్ హీరోకి మన దేశంలో కాకుండా అమెరికా(America)లో కూడా ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రముఖ వ్యక్తులు జయంతి వర్ధంతి రోజు ఇలా సెలవు ప్రకటించడం చూస్తుంటాం. కానీ ఒక హీరో పుట్టినరోజుకు ఇలా సెలవు ప్రకటించడంతో ఆయన పై ఎంత అభిమానం ఉందో తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగులో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్లను విడుదల చేస్తూ పవన్ అభిమానులకు వరుస సర్ప్రైస్ లను ఇస్తున్నారు. ఇకపోతే పవన్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి(Chiranjeevi) తన తమ్ముడికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మెగా హీరోలతో పాటు ఇతర నటీనటులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం ‘భీమ్లా నాయక్‌’, ‘హరిహర వీరమల్లు’చిత్రాలతో పవన్‌ కల్యాణ్‌ బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించారు. హరీశ్ శంకర్, పవన్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది.‘PSPK 28’ వర్కింగ్‌ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News