ఎన్టీఆర్ బయోపిక్‌లో శౌర్యరామ్..?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ ఓ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

Last Updated : Jan 8, 2018, 05:18 PM IST
ఎన్టీఆర్ బయోపిక్‌లో శౌర్యరామ్..?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ ఓ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఎన్టీఆర్‌గా స్వయాన బాలకృష్ణ నటించగా.. చిన్ననాటి ఎన్టీఆర్‌గా ఎవరు నటిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ పాత్రలో బాలనటుడిగా ఎవరు నటిస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చాక.. తగు చర్చలు జరిపి ఎట్టకేలకు నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బహుశా ఆ పాత్రను నందమూరి కల్యాణ్‌ రామ్‌ కుమారుడు శౌర్యరామ్‌ పోషించే అవకాశం ఉందనేది సినీ వర్గాల సమాచారం. శౌర్యరామ్‌ ఇప్పటికే కల్యాణ్‌ రామ్‌ నటించిన ‘ఇజం’ చిత్రంలో నటించారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌లో బాలకృష్ణ త్వరలోనే పాల్గొననున్నట్లు సమాచారం. జనవరి 18న ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని నిర్మాతలు ఈ బయోపిక్ టీజర్‌ను విడుదల చేయనున్నారని వినికిడి 

Trending News