Sivakarthikeyan upcoming Movie: కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్‌ కొత్త చిత్రం.. కాశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్..

Sivakarthikeyan New Movie: శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan) కొత్త చిత్రం కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను ఫూర్తి చేసుకుంది. ఇందులో శివ కార్తికేయన్‌ కు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2023, 01:19 PM IST
Sivakarthikeyan upcoming Movie: కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్‌ కొత్త చిత్రం.. కాశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్..

Sivakarthikeyan upcoming Movie: కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్(Sivakarthikeyan) న‌టిస్తున్న చిత్రం #ఎస్‌కే21. ఈ మూవీ SK21 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇందులో శివకార్తికేయన్ కు జోడిగా  సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తోంది. ఈ చిత్రానికి ‘రంగున్’ ఫేం రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyasaami) దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా సంస్థ కూడా భాగం కానుంది. జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతుంది. సుమారు 75 రోజులపాటు కశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ‘మహావీరుడు’(Mahaveerudu) సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. 

శివకార్తికేయన్‌కు కోలీవుడ్ తోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘రెమో’(Remo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివకార్తికేయన్‌.. ‘డాక్టర్‌’ (Doctor), ‘డాన్‌ వంటి సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించాడు. ఇటీవల ఆయన ‘ప్రిన్స్‌’ అనే డైరెక్ట్‌ తెలుగు సినిమా చేశాడు. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇటీవల ఈయన నటించిన ‘మహావీరుడు’(Mahaveerudu) కూడా తెలుగులో రిలీజై ఘన విజ‌యం సాధించింది. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదితి శంకర్‌ హీరోయిన్ గా నటించింది. మరోవైపు శివకార్తికేయన్ అయలాన్(Ayalaan‌) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also read: Jawan Trailer Review in Telugu: ఎంతో ఎదురుచూసిన ' జవాన్ మూవీ ట్రైలర్ ' ఎలా ఉందంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News