అగ్రహీరోలకు పోటీగా శివ కార్తికేయన్ రెమ్యూనరేషన్​- కోలీవుడ్​లో హాట్ టాపిక్!

Siva Karthikeyan: వరుణ్​ డాక్టర్ మూవీతో జోరుమీదున్న శివకార్తికేయన్​ రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. అగ్రహీరోలకు పోటీగా ఆయన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 04:55 PM IST
  • అగ్రహీరోలకు పోటీగా శివకార్తికేయన్ రెమ్యూనరేషన్​!
  • కోలీవుడ్​ వర్గాల్లో హాట్​ టాపింక్​గా ఇదే అంశం
  • డాక్టర్​ హిట్టుతో జోరుమీదున్న యువ హీరో
అగ్రహీరోలకు పోటీగా శివ కార్తికేయన్ రెమ్యూనరేషన్​- కోలీవుడ్​లో హాట్ టాపిక్!

Sivakarthikeyan: తమిళ హీరో శివ కార్తికేయన్  ఇప్పుడు టాక్ ఆఫ్​ ది కోలీవుడ్​గా మారాడు. హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతుండటమే ఇందుకు (Sivakarthikeyan Hits) కారణంగా తెలుస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కేరీర్ ప్రారంభించి.. హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ ఇటీవల ప్రోడ్యూసర్​గా కూడా మారారు. తాను హీరోగా నటించిన తాజా చిత్రం వరుణ్ డాక్టర్​కు (Doctor Film news) ఆయనే నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం సాధించింది. ఈ నెల ఆరంభంలో సినిమా రూ.100 కోట్ల క్లబ్​లో కూడా చేరింది. దీనితో వరుస విజయాలతో జోష్​లో ఉన్న శివకార్తికేయన్​.. రెమ్యూనరేషన్​ పెంచినట్లు కోలీవుడ్ (Kollywood talk on Siva karthikeyan) వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కోలీవుడ్ అగ్రహీరోలకు పోటీగా.. శివ కార్తికేయన్​ రూ.27-రూ.35 కోట్ల వరకు (Sivakarthikeyan Remuneration) డిమాండ్​ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్​.

Also read: దక్షిణాది అగ్రనటి నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Also read: సరోగసి ద్వారా కవలలకు తల్లి అయిన బాలీవుడ్ నటి ప్రీతీ జింటా

వరుణ్ డాక్టర్ హిట్టుతో జోరు..

కరోనా రెండో దశ తర్వాత నేరుగా థియేటర్లలో విడుదలైన వరుణ్ డాక్టర్ (తమిళంలో డాక్టర్) మంచి విజయం (Varun Doctor) సాధించింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడుతు వచ్చంది. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇటీవలే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్​లో చేరింది. ఇదే సమయంలో శివకార్తికేయన్ రెమ్యూనరేషన్​ పెంచినట్లు కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Also read: ఆర్ఆర్ఆర్ : ఆ పోస్టుకు నాలుగేళ్లు, 50 రోజుల్లో మ్యాజిక్ రిపీట్

వరుణ్ డాక్టర్ మూవీ గురించి..

ఈ సినిమాలో శివకార్తికేయన్​కు జంటగా.. నాని గ్యాంగ్​ లీడర్ ఫేమ్​  ప్రియాంక అరుళ్ మోహ‌న్‌ హీరోయిన్​. యోగిబాబు, విన‌య్ రాయ్‌, మిలింద్ సోమ‌న్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. నెల్సన్​ దిలీప్ కుమార్​ దర్శకత్వం వహించగా.. అనిరుధ్​ మ్యూజిక్ అందించారు.

ప్రస్తుతం శివ కార్తికేయన్ అయ‌లాన్‌, డాన్ సినిమాల్లో న‌టిస్తున్నారు. అయ‌లాన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటోంది. డాన్​ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే సన్​ పిక్చర్​ నిర్మాణంలో మరోసినిమాకు సైన్  చేశారు శివకార్తికేయన్​.

Also read: మెగాస్టార్ చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్...'గాడ్​ఫాదర్' మూవీ నుంచి నయన్ పోస్టర్ రిలీజ్..

Also read: స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News