Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే

Mrunal Thakur Romantic Character మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతోనే సౌత్ మొత్తాన్ని కట్టి పడేసింది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయింది. అంతకు ముందు హిందీలో ఆమె చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. సీతారామం ఇంకో ఎత్తు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 10:27 AM IST
  • నెట్టింట్లో సీతారామం బ్యూటీ
  • ఏ పాత్ర చేయాలని అడిగిన హీరోయిన్
  • మృణాళ్‌కు ఆ పాత్రే సెట్ అవుతుందా?
Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే

Mrunal Thakur Romantic Character మృణాల్ ఠాకూర్‌కు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉంది. శ్రద్దా కపూర్, దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే మృణాల్‌కే తెలుగులో ఎక్కువగా క్రేజ్ ఉంది. సీతారామం సినిమాతో మృణాల్ ఇమేజ్ పెరిగిపోయింది. మన తెలుగు హీరోయిన్‌లా మృణాల్‌ను ట్రీట్ చేస్తున్నారు. అందుకే ఆమెకు తెలుగులో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. నానితో ఇప్పుడు మృణాల్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ సీజన్‌లో రాబోతోన్న విషయం విదితమే.

తెరపై మృణాల్ కనిపించిన తీరుకు, సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించే తీరును చూసి జనాలు ఫిదా అవుతున్నారు. మృణాల్ బికినీలో కనిపించే సరికి అంతా షాక్ అయ్యారు. ఇదేంటి సీత ఇలా మారిపోయింది.. ఇలా బికినీలో అందాలను ప్రదర్శించేస్తోందని మృణాల్‌ను చూసి అంతా నోరెళ్లబెట్టేస్తుంటారు. అలా మృణాల్‌కు తెలుగులో హార్డ్ కోర్ ఫ్యాన్స్ వచ్చేశారు. సీతారామం సీతగానే మృణాల్‌ను చూస్తున్నారు.

 

అలాంటి సీత ఇప్పుడు ఓ ట్వీట్ వేసింది. ఓ పోల్ పెట్టేసింది. తాను నెక్ట్స్ ఎలాంటి జానర్‌ సినిమాను చేయాలి? అని తన ఫాలోవర్లకు ఆప్షన్ ఇచ్చింది. రొమాన్స్, యాక్షన్, హారర్, ఫాంటసీ జానర్‌లలో ఏ సినిమాను చేయాలని అడిగింది. అయితే అరవై శాతంకి పైగా ఓట్లు రొమాన్స్ జానర్‌కే వచ్చాయి. దీంతో సీతను మళ్లీ రొమాంటిక్ సినిమాల్లోనూ చూడాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

ఈ మధ్య కాలంలో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన వారిలో ఈ రేంజ్‌ సక్సెస్‌ను ఎవ్వరూ చూడలేదు. మృణాల్‌ మాత్రం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. సీతారామం సినిమా మాత్రం సౌత్‌లో ఆమెకు మంచి డెబ్యూగా నిలిచింది. మళ్లీ దుల్కర్, మృణాల్ కాంబోలో సినిమా రావాలని ఇక్కడి ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News