Bigg Boss Siri : శ్రీహాన్‌కు లిప్ లాక్.. బిగ్ బాస్ ఇంట్లో మితిమీరిన రొమాన్స్.. అట్లుంటది సిరితోని

Siri Shrihan liplock శ్రీహాన్ కోసం సిరి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సిరికి బిగ్ బాస్ ఇంటికి వస్తేనే ఏదో పూనుతుంటుందేమో. ఇక తన స్టైల్లో హగ్గులు, ముద్దులు

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 12:31 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో సిరి సందడి
  • శ్రీహాన్‌కు ముద్దుల వర్షం
  • లిప్‌ లాక్‌తో శ్రీహాన్‌కు సిరి షాక్
Bigg Boss Siri : శ్రీహాన్‌కు లిప్ లాక్.. బిగ్ బాస్ ఇంట్లో మితిమీరిన రొమాన్స్.. అట్లుంటది సిరితోని

Siri Shrihan liplock : బిగ్ బాస్ ఇంట్లో గత సీజన్లో సిరి, షన్ను చేసిన రచ్చనే ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. గాలి దూరనంత దగ్గరగా ఉండేవారు. హగ్గులు ఇచ్చుకునేవారు. ఇక సిరి అయితే షన్నుని ముద్దుల్తో ముంచెత్తేది. ఇద్దరూ ఒక్క బెడ్డు మీదే పడుకునేవారు. అలా పడుకోవడం వద్దు అని షన్ను అంటే.. సిరి తెగ ఫీలైపోయింది. సిరి అంటే రొమాన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. సిరి షన్నుల దెబ్బకు దీప్తి సునయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. 

సిరి దెబ్బకు షన్నుకి బ్రేక్ అప్ చెప్పేసింది దీప్తి సునయన. శ్రీహాన్, సిరి మధ్య కూడా దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. కానీ చివరకు మళ్లీ కలిశారు. అయితే ఇప్పుడు శ్రీహాన్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు. శ్రీహాన్ కోసం సిరి బిగ్ బాస్ ఇంటికి వచ్చింది. ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కూడా తీర్చుకుంది. హగ్గులు, కిస్సులు అన్నీ ఒకెత్తు అయితే.. చివర్లో సిరి ఇచ్చిన లిప్ లాక్ ఒకెత్తు. కావాలనే షో చేసినట్టుగా అనిపించింది. మొత్తానికి సిరి లిప్ లాక్ దెబ్బకు శ్రీహాన్ మైండ్ బ్లాక్ అయినట్టుంది.

 

మరి సిరితో అట్లుంటది అనేట్టుగా చేసేసింది. మామూలుగానే బిగ్ బాస్ షోలో సిరి టాప్ లేసేస్తుంది. ఫ్రెండ్ అనుకునే షన్నుతోనే రొమాన్స్‌లో టాప్ లేపేసింది. ఇక లవర్ ఉంటే సిరి ఆగుతుందని అనుకోవడం మన భ్రమే అవుతుంది. షన్నుని ముద్దులతో ముంచెత్తింది సిరి. మెడ వెనుక భాగం మీద శ్రీహాన్ టాటూ వేయించుకుంది. అది చూసి శ్రీహాన్ మురిసిపోయాడు.

సన్ని సపోర్ట్ చేస్తున్నాడని హింట్ ఇచ్చింది.. ఇనయ, శ్రీ సత్యలకు సిరి కౌంటర్ వేసింది. ఫ్రెండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారంటూ శ్రీహాన్‌కు సిరి హింట్ ఇచ్చింది. మొత్తానికి సిరి, శ్రీహాన్ రొమాన్స్ మాత్రం మరోసారి గత సీజన్‌ను గుర్తు చేసింది. అప్పుడు ఫ్రెండ్ అయిన షన్నుతో రచ్చ చేసింది. ఇప్పుడు లవర్ అయిన శ్రీహాన్‌తో పిచ్చెక్కించింది.

Also Read : Naga Chaitanya Shobitha Dhulipalla : అడ్డంగా దొరికిపోయిన శోభితా-నాగ చైతన్య?.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్.. అక్కినేని అభిమానుల మాట ఇదే  

Also Read : Richa Chadha controversy : మా ప్రెసిడెంట్‌కు కోపం తెప్పించిన బాలీవుడ్ నటి.. ఏం ఆడది ఇది?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News