Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 విన్నర్ గా రేవంత్.. పాపం పప్పులో కాలేసిన శ్రీహాన్!

Singer Lv Revanth Became Winner Of Bigg Boss : ముందు నుంచి అంచనాలు వెలువడినట్టుగానే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా ఎల్వీ రేవంత్ నిలిచారు, ముందు నుంచి అనేక సార్లు నామినేట్ అవుతూ గట్టి కంటెస్టెంట్ అనిపించుకున్న ఆయన ఎట్టకేలకు కప్ సాధించాడు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 18, 2022, 10:56 PM IST
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 విన్నర్ గా రేవంత్.. పాపం పప్పులో కాలేసిన శ్రీహాన్!

Singer Lv Revanth Became Winner Of Bigg Boss Season 6 Telugu: సుదీర్ఘకాలంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు ముగిసింది. అనేక ట్విస్టుల మధ్య బిగ్ బాస్ 6 విన్నర్ గా రేవంత్ ను నాగార్జున ప్రకటించారు. సెప్టెంబర్ 4వ తేదీన ఘనంగా ప్రారంభమైన బిగ్బాస్ ఆరవ సీజన్లోకి మొత్తం 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. కీర్తి, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, రోహిత్, మెరీనా, బాలాదిత్య, వాసంతి, షానీ సాల్మన్, ఆర్ జె సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి వంటి వారు ఎంట్రీ ఇచ్చారు.

అయితే అనేకమంది ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్బాస్ తెలుగు సీజన్ సిక్స్ టాప్ ఫైవ్లోకి రేవంత్, రోహిత్, శ్రీహాన్, కీర్తి బట్, ఆది రెడ్డి ఎంట్రీ ఇచ్చారు, డిసెంబర్ 18 ఆదివారం నాడు నిర్వహించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఒక్కొక్కరిని చేస్తూ చివరికి టైటిల్ విజేతగా సింగర్ రేవంత్ ను ఎన్నుకున్నారు. ఆయనకు ట్రోఫీ అందించారు. ముందుగా బిగ్బాస్ హౌస్లోకి హీరో నిఖిల్ వెళ్లి 18 పేజీస్  సినిమా ప్రమోషన్స్ చేసుకొని రోహిత్ ను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చాడు.

ఆ తరువాత ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. వీరిద్దరి ఎలిమినేషన్ తర్వాత మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమా ప్రమోషన్స్ కోసం హౌస్ లోకి వెళ్లి కీర్తి భట్ ను డబ్బుతో టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఏమాత్రం టెంప్ట్ అవ్వలేదు. అయితే ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి బయటకు తీసుకువచ్చారు. తర్వాత రేవంత్ శ్రీహాన్ ఇద్దరికీ మధ్య పోటీ నెలకొనగా ఫైనల్ గా రేవంత్ గెలిచినట్లుగా ప్రకటించి ఆయనకు కప్పిచ్చారు.

అయితే చివరిలో నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే చివర్లో శ్రీహన్ టెంప్ట్ అయ్యి 40 లక్షల బ్రీఫ్ కేస్ అందుకోవడంతో రన్నర్ ఆఫ్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, దీంతో రేవంత్ ని విన్నర్ గా ప్రకటించి విన్నర్ ట్రోఫీ అతని చేతిలో పెట్టారు. కానీ అసలు ఓట్ల ప్రకారం రేవంత్ కాదు శ్రీహాన్ విన్నర్ గా నిలిచాడట. రేవంత్ కంటే శ్రీహానికి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు నాగార్జున చెప్పడంతో శ్రీహాన్ షాక్ అయ్యాడు. కానీ అప్పటికి ఏమీ చేయలేడు కాబట్టి సైలెంట్ అయ్యాడు, ఇక కోటి రూపాయల ప్రైజ్ మనీలో 40 లక్షలు శ్రీకాంత్ తీసుకోవడంతో మిగతా డబ్బుతో రేవంత్ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

Also Read:  Tarakaratna: వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!

Also Read:  New Year: న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్త.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News