DJ Tillu OTT: ఓటీటీలోకి 'డీజే టిల్లు'.. త్వరలోనే టిల్లుగాడి లొల్లి షురూ!!

DJ Tillu Streaming on OTT platform Aha Video: థియేటర్లలో సందడి చేసిన డీజే టిల్లు సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 01:38 PM IST
  • ఫిబ్రవరి 12న డీజే టిల్లు విడుదల
  • ఓటీటీలోకి 'డీజే టిల్లు'
  • త్వరలోనే టిల్లుగాడి లొల్లి షురూ
DJ Tillu OTT: ఓటీటీలోకి 'డీజే టిల్లు'.. త్వరలోనే టిల్లుగాడి లొల్లి షురూ!!

DJ Tillu streaming on OTT platform Aha Video: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్‌లుగా వచ్చిన చిత్రం 'డీజే టిల్లు'. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. డీజే టిల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్‌ అందరిని ఆకట్టుకోవడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన సినిమా.. ఆ అంచనాలను అందుకుంది. అంతేకాదు బంపర్ హిట్ కొట్టింది. 

థియేటర్లలో టిల్లుగాడి లొల్లికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువత బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాసలో సిద్ధు చెప్పే డైలాగ్స్, నేహా శెట్టి అందం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక సినిమాలో రామ్ మిర్యాల పాడిన డీజే టిల్లు సాంగ్ బాగా పాపులర్ అయింది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను శ్రీచరణ్‌ పాకాలతో కలిసి రామ్‌ మిర్యాల స్వరాలు అందించారు. థమన్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. అన్ని అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు హిట్ టాక్ తెచ్చుకుంది. 

థియేటర్లలో సందడి చేసిన డీజే టిల్లు త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. 'ఇక టిల్లుగాడి లొల్లి ఆహాలో. త్వరలోనే వస్తుంది' అని ఓ పోస్టర్ వదిలింది. 'డీజే టిల్లు దుమ్ము ధూలపదానికి వచ్చేస్తున్నాడు. స్క్రాచ్ ఉంటుంది, రెడీగా ఉండండి' అని ఓ కాప్షన్ కూడా ఇచ్చింది. ఆహా ఫ్యాన్సీ ధరకు ఓటీటీ హక్కులు  దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే డీజే టిల్లు రిలీజ్ తేదీ (ఫిబ్రవరి 12) నుంచి.. 4 వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే మార్చి ఆరంభంలో (10) విడుదల అయ్యే అవకాశం ఉంది. థియేటర్లలో దుమ్ములేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక  ఈసినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. సిద్ధూ పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చినా.. సరైన సినిమా పడడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇక నేహా శెట్టికి కూడా మంచి హిట్ ఖాతాలో వేసుకుంది. 

Also Read: Leander Paes Rhea Pillai: మోడల్‌తో లివ్‌ఇన్ రిలేషన్‌.. దోషిగా తేలిన లియాండర్ పేస్!!

Also Read: Samantha Viral Post: 'నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదు'.. సమంత ఎమోషనల్ పోస్ట్!!

Trending News