Aadi Sai Kumar : ఆది కోసం 'టాప్ గేర్' వేసిన సిద్ శ్రీ రామ్!

Sid Sri Ram Vennela Vennela Song: సిద్ శ్రీ రామ్ ఆది సాయి కుమార్ కోసం మరోసారి గొంతు సవరించుకోనున్నాడు, క్రేజీ ఫెలో కోసం ఆయన ఒక పాటను ఆలపించారు. 

Last Updated : Nov 20, 2022, 08:20 PM IST
Aadi Sai Kumar : ఆది కోసం 'టాప్ గేర్' వేసిన సిద్ శ్రీ రామ్!

Sid Sri Ram Sung Vennela Vennela Song For Aadi Sai Kumar: తమిళ వ్యక్తి అయినా తెలుగులో పాటలు పాడుతూ సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు సిద్ శ్రీరామ్. ఇప్పటికే ఆయన తెలుగులో పాడిన పాటలు కొన్ని మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుని ఇంకా ప్రేక్షకులను శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సిద్ శ్రీరామ్ పాట పాడితే ఆ సినిమా ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకుపోతుంది.

అందుకే ఇప్పటికే ఆది సాయి కుమార్ కోసం గతంలో సిద్ శ్రీరామ్ ఒక పాట పాడారు. ఇప్పుడు ఆయన మరోసారి తన గాత్రాన్ని ఆది సాయికుమార్ కోసం అందించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగానే ఆయన టాప్ గేర్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆది సాయి కుమార్ టాప్ గేర్ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సినిమాకు కె శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ పాడిన పాట విడుదల చేయడానికి రంగం సిద్ధం అయింది. సిద్ శ్రీరామ్ పాడిన 'వెన్నెల వెన్నెల' సాంగ్ ను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ టాప్ గేర్ సినిమాను  ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుసున్నారు. ఆది సాయి కుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్న  ఈ సినిమాను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.  
Also Read: Naga Shaurya: అనూష శెట్టిని వివాహమాడిన నాగశౌర్య.. రాచరికపు స్టైల్ లో విందు భోజనం!

Also Read: Naresh - Pavitra: మాది అపవిత్ర ప్రేమ కాదు.. నరేష్-పవిత్రల 'ప్రేమ కథా చిత్రమ్'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News