Shoot-out at Alair Teaser: సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో షూట్ ఔట్ ఎట్ ఆలేరు టీజర్

మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొనిదెల తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ టైటిల్ షూట్ ఔట్ ఎట్ ఆలేరు. 2015లో సంచలనం సృష్టించిన ఆలేరు ఎన్‌కౌంటర్ కేస్ ఫైల్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌ని ఓయ్ మూవీ ఫేమ్ ఆనంద్ రంగ డైరెక్ట్ చేస్తున్నాడు.

Last Updated : Nov 14, 2020, 01:23 AM IST
Shoot-out at Alair Teaser: సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో షూట్ ఔట్ ఎట్ ఆలేరు టీజర్

మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొనిదెల తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ టైటిల్ షూట్ ఔట్ ఎట్ ఆలేరు. 2015లో సంచలనం సృష్టించిన ఆలేరు ఎన్‌కౌంటర్ కేస్ ఫైల్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌ని ఓయ్ మూవీ ఫేమ్ ఆనంద్ రంగ డైరెక్ట్ చేస్తున్నాడు. 2007లో యు రమేష్ అనే పోలీసు కానిస్టేబుల్‌ని హతమార్చిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐదుగురు ఉగ్రవాదులు అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు ( ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ) వద్ద జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ( Alair encounter ) హతమైన సంగతి తెలిసిందే. 

షూట్ ఔట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్ టీజర్‌ని విడుదల చేసిన నిర్మాతలు.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి జీ5లో ( Shoot-out at Alair on Zee5 ) ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానున్నట్టు ఈ టీజర్ ద్వారా తెలిపారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో, నందిని రాయ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సస్పెన్స్‌కి గురిచేసే అనేక అంశాలు ఉన్నాయి. ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏవీ ఈ టీజర్ ద్వారా బహిర్గతం కాకుండా టీజర్‌ని కట్ చేశారు. 

Also read : Prabhudeva: మళ్లీ పెళ్లి చేసుకోనున్న ప్రభుదేవా

ఆవేశంతో కూడిన పాత్రలు చేయడంలో, అందులోనూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, మిలిటరీ ఆఫీసర్స్‌గా నటించి మెప్పించిన నటులు శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ఈ వెబ్ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్స్ పాత్రల్లో నటిస్తుండటం షూట్ ఔట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్‌కి ( Shoot-out at Alair web series ) మరో ప్లస్ పాయింట్ అయింది. ఆలేర్ ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన అల్లర్లు, ఆందోళనలు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులపై విచారణ తదితర అంశాలన్నీ షూట్ ఔట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్ కథాంశంలో ఓ భాగమవడంతో ఓటిటి ఆడియెన్స్‌లో ఈ వెబ్ సిరీస్ పట్ల క్రేజ్ ఏర్పడింది.

Also read : RRR టీమ్ దీపావళి సర్‌ప్రైజ్ చూశారా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని ఆసక్తికరమైన వార్తలు, అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News