Shankar: డైరెక్టర్ పై మెగా అభిమానుల ఆగ్రహం.. పండగ రోజు కూడా నిరాశేనా?

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ కూడా వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి కూడా శంకర్ కారణంగా మెగా అభిమానులకి కేవలం నిరాశ మాత్రమే మిగిలింది అని తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2023, 10:40 AM IST
Shankar: డైరెక్టర్ పై మెగా అభిమానుల ఆగ్రహం.. పండగ రోజు కూడా నిరాశేనా?

Game Changer : ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ సౌత్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో  గేమ్ చేంజర్ అనే సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చి రెండేళ్లు గడుస్తుంది కానీ ఇంకా సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి.

సినిమా ప్రకటించినప్పటి నుంచి షూటింగ్ కి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడి మళ్లీ తిరిగి మొదలైంది. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమాకి వస్తున్న అడ్డంకులు చూస్తూ ఉంటే అసలు సినిమా ఇప్పట్లో విడుదలవుతుందా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

ఎప్పటినుంచో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఏడాది దీపావళి సందర్భంగా కనీసం సినిమాకి సంబంధించిన ప్రోమో లేదా టీజర్ అయినా వస్తుంది అని అనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే శంకర్ మెగా అభిమానులకి కనీసం ఈ ఆనందం కూడా దక్కేలా చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు గేమ్ చేంజర్ సినిమా తో బిజీగా ఉన్న శంకర్ మరోవైపు కమలహాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా పై కూడా అంతే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విజయవాడలో జరుగుతుంది.  ఇక దీపావళి సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా నుంచి కేవలం ఒకే ఒక పాట మాత్రమే విడుదల కాబోతోందట. దీంతో మరొకసారి శంకర్ నుంచి కారణంగా మెగా అభిమానులకు నిరాశ మాత్రమే మిగిలే లాగా కనిపిస్తోంది.

సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా శంకర్ చాలా సార్లు మెగా అభిమానులను నిరాశ కలిగించారు. ఈ ఏడాది కూడా శంకర్ అదే వైఖరి చూపించడంతో మెగా అభిమానులకు మరింత నిరాశ కలుగుతోంది. సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు కూడా సినిమా అప్డేట్స్ అన్నీ డైరెక్టర్ శంకర్ చేతుల్లోనే ఉన్నాయి అని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఈ సినిమా లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News