Jawan Movie: మరో రికార్డు క్రియేట్ చేసిన 'జవాన్'.. బాలీవుడ్ హిస్టరీలోనే తొలి సినిమాగా ఘనత..

Jawan Movie: జవాన్ సినిమాతో షారుఖ్  పలు రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు కింగ్ ఖాన్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2023, 10:11 PM IST
Jawan Movie: మరో రికార్డు క్రియేట్ చేసిన 'జవాన్'..  బాలీవుడ్ హిస్టరీలోనే తొలి సినిమాగా ఘనత..

Jawan Movie: బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan)-కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన జవాన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా సెప్టెంబరు 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. తాజా అప్ డేట్ ప్రకారం, ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.1068 కోట్ల కలెక్షన్స్ ను సాధించి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇందులో కేవలం ఓవర్సీస్‌ మార్కెట్‌ నుంచే రూ.361.35 కోట్లు వచ్చాయి. తాజా వసూళ్లుతో ఈ మూవీ హిందీ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో షారుక్‌ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. 

జవాన్ సినిమా విడుదలై దాదాపు నెల రోజుల అవుతున్నా ఇప్పటికీ థియేటర్లులో విజయవంతంగా నడుస్తోంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై షారుక్‌ భార్య గౌరీఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో షారుఖ్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. దీపికా పదుకొనే, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ చేశారు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన ‘పఠాన్‌’ కూడా రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్స్‌ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే ఏడాది రెండుసార్లు రూ.1000 కోట్ల కలెక్ట్ చేసిన హీరోగా షారుఖ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 

Also Read: Mark Antony Movie: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'మార్క్ ఆంటోని'.. 100 కోట్లకు చేరువలో విశాల్ మూవీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News