Jawan OTT Release: జవాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఇవాళ రాత్రి నుంచి అదనపు సీన్స్‌తో, ఎందులోనంటే

Jawan OTT Release: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు వరుసగా రెండవ హిట్ ఇచ్చిన జవాన్ సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. బాక్సాఫీసులో వసూళ్ల వర్షం కురిపించిన జవాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 1, 2023, 08:49 AM IST
Jawan OTT Release: జవాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఇవాళ రాత్రి నుంచి అదనపు సీన్స్‌తో, ఎందులోనంటే

Jawan OTT Release: పఠాన్ సినిమాతో తిరిగి హిట్ సాధించిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు అంతకంటే మెగా హిట్ ఇచ్చింది జవాన్ సినిమా. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో షారుఖ్ ఖాన్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. తొలిసారిగా దక్షిణాది దర్శకుడితో చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం.

ఇప్పుడీ సూపర్ డూపర్ హిట్ మూవీ జవాన్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. దక్షిణాది దర్శకుడు అట్లీ తెరరెక్కించిన జవాన్ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార ప్రధాన నటిగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఇక బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ మరో కీలకపాత్రలో నటించింది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసులో రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. అన్ని రికార్డుల్ని తిరగరాస్తూ ఏకంగా 1100 కోట్ల కలెక్షన్లు చేసింది. 

ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో ఓటీటీలో ఎప్పుడెస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు చేజిక్కించుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు పురస్కరించుకుని నవంబర్ 2న అంటే రేపట్నించి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జవాన్ స్ట్రీమింగ్ కానుంది. అంటే మరి కొద్ది గంటల్లో జవాన్ ఓటీటీలో వీక్షణకు సిద్ఘంగా ఉంటుంది. 

జవాన్ సినిమాకు సంబంధించి మరో కీలకమైన అప్‌డేట్ ఉంది. థియేటర్‌లో కంటే ఓటీటీలో ఈ సినిమా రన్‌టైమ్ పెరగనుంది. ధియేటర్‌లో జవాన్ సినిమా రన్‌టైమ్ 169 నిమిషాలు కాగా ఓటీటీలో ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రన్‌టైమ్ సమస్య కోసం కట్ చేసిన కొన్ని సన్నివేశాల్ని ఓటీటీ వెర్షన్‌లో జోడిస్తున్నారు. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. 

షారుఖ్ ఖాన్ యాక్షన్ సీన్స్, నయనతార, దీపిక నటన, విజయ్ సేతుపతి విలనిజం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయంటున్నారు. కధనం, తెరకెక్కించిన విధానంలో అట్లి అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి తదితరులు కన్పిస్తారు. జవాన్ సినిమా థియేటర్‌లో చూడనివారు ఇక సిద్ధమైపోండి. ఇవాళ రాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also read: Jhanvi Kapoor : దేవర లుక్ తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వి కపూర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News