Taapsee Pannu: సినిమాల్లోనే చాలా డ్రామా ఉంది.. వ్యక్తిగత లైఫ్‌లో అవసరం లేదు: స్టార్ హీరోయిన్

Taapsee Pannu Opens Up About Her Marriage Plans. తాజాగా బ్రైడ్స్ టుడే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్నించగా..  తాప్సీ పన్ను ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దాంతో సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 12:59 PM IST
  • సినిమాల్లోనే చాలా డ్రామా ఉంది
  • వ్యక్తిగత లైఫ్‌లో అవసరం లేదు
  • డ్రామా లేకుండా నా వివాహాం జరిగిపోవాలి
Taapsee Pannu: సినిమాల్లోనే చాలా డ్రామా ఉంది.. వ్యక్తిగత లైఫ్‌లో అవసరం లేదు: స్టార్ హీరోయిన్

Taapsee Pannu Opens Up About Her Wedding Plans: 'ఝుమ్మంది నాదం' మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. కెరీర్ ఆరంభం నుంచి ప్రాధాన్యత కలిగిన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు వరుస అవకాశాలు వస్తుండటంతో.. ప్రస్తుతం ముంబైలోనే స్థిరపడ్డారు. ఝుమ్మంది నాదంతో మొదలై ఆమె సినీ కెరీర్.. అలాఅలా సాగిపోతుంది. తాజాగా వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంతో తాప్సీ ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా బ్రైడ్స్ టుడే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్నించగా..  తాప్సీ పన్ను ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దాంతో సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. 'ఒక్క రోజులోనే డ్రామా లేకుండా నా వివాహాం జరిగిపోవాలి. నేను నటిస్తున్న మూవీల్లోనే చాలా డ్రామా ఉంటుంది, వ్యక్తిగత లైఫ్‌లో అవసరం లేదు. నేను వివాహాం చేసుకునేటప్పుడు నా జుట్టును ఎక్కువగా అలంకరించుకోను. ఎందుకంటే ముఖ్యంగా ఆ ఫొటోలను చూసుకుంటే మీకు మీరే ఓ రకంగా కనిపిస్తారు' అని తాప్సీ అన్నారు.  

'పెళ్లి నాటి మధుర జ్ఞాపకాలు కొద్దిసేపు మాత్రమే ఉండవు. జీవితాంతం మన దగ్గర నిలిచిపోవాలి. ప్రస్తుతం పెళ్లి కూతుళ్లు విపరీతంగా మేకప్ వేసుకుంటున్నారు. వారిని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను మాత్రం అలా వేసుకోను' అని తాప్సీ అన్నారు. తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ అయిన మథియాస్‌ బోనుతో ప్రేమలో  ఉన్నారు. గత కొంతకాలంగా అతడితో కలసి జీవనం చేస్తున్నారు. 

ఇక తాప్సీ పన్ను కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'శభాష్ మిథు'లో నటిస్తున్నారు. ఈ బయోపిక్‌ కోసం తాప్సీ ప్రత్యేకంగా క్రికెట్ పాటలు కూడా నేర్చుకున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో ఆమె నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, మొగుడు, సాహసం సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. 

Also Read: Prabhas Maruti Movie: హారర్ నేపథ్యంలో ప్రభాస్, మారుతి చిత్రం.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం!

Also Read: Ram Charan Gold Coin: 'బంగారు' మనసు చాటుకున్న మెగాపవర్ స్టార్.. RRR యూనిట్ కు స్పెషల్ గిఫ్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News