Sekhar Kammula: మరోసారి పెద్ద మనసు చాటుకున్న శేఖర్ కమ్ముల..ప్రశంసిస్తున్న నెటిజన్స్..!

Director Sekhar Kammula: టాలీవుడ్ దర్శకుడ శేఖర్ కమ్ముల మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గుడిసె దగ్ధమై డబ్బు కోల్పోయిన రైతుకు సాయం చేశారు. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 04:35 PM IST
Sekhar Kammula: మరోసారి పెద్ద మనసు చాటుకున్న శేఖర్ కమ్ముల..ప్రశంసిస్తున్న నెటిజన్స్..!

Director Sekhar Kammula: డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ రైతు(Farmer)కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. సూర్యాపేట జిల్లా(Suryapeta district) మునగాల మండలం నేలమర్రిలో ఈ నెల 21న కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ క్రమంలో బీరువాలోని ఆరు లక్షల రూపాయలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయలు పంపించారు. రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

Also Read: Top webseries: ఈ మధ్య కాలంలో నెటిజన్లను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లివే..!

ఆపద కాలంలో ఆదుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు శేఖర్‌ కమ్ముల(Director Sekhar Kammula). గతేడాది కరోనా వైరస్‌(coronavirus) విజృంభిస్తున్న వేళ.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ అమిగోస్‌ నుంచి వెయ్యి మంది కార్మికులకు నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అందించారు. శేఖర్ కమ్ముల ఈ మధ్యే లవ్‎స్టోరి సినిమా(Love Story Movie) తీసి మంచి హిట్ సొంతం చేసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News