Gurthunda Seethakalam Trailer: ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్‌

Gurthunda Seethakalam Trailer: సత్యదేవ్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్‌ 'గుర్తుందా శీతాకాలం'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 02:06 PM IST
Gurthunda Seethakalam Trailer: ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్‌

Gurthunda Seethakalam Trailer: సత్యదేవ్‌, తమన్నా (Tamannah) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam). రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు  నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. కావ్యా శెట్టి, మేఘా ఆకాశ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వాలంటైన్స్‌ డే (valentines day) సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

'శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చనికాలం..' అంటూ సత్యదేవ్ (Sathyadev) పలికే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరో స్కూల్ డేస్ నుంచి వయసు పెరిగే కొద్దీ ప్రేమలో ఎలా పడ్డాడో ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమా నుంచి ఇది వరకే రిలీజైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. 

ఈ చిత్రం హిట్ మూవీ‘'లవ్ మాక్‌టైల్' (Love Mocktail)కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ను చూస్తుంటే.. నా ఆటోగ్రాప్ తరహాలో సాగే ప్రేమకథగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. 

Also Read: Sree Leela 'Dhamaka' Look: రవితేజ మూవీ నుంచి 'శ్రీలీల' ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎలా ఉందంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News