Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి స్టోరీ ఇదేనా?

Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా.. ఆ లిరికల్ వీడియోలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. దీంతో స్టోరీ రివీల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరగుతున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 12:28 PM IST
Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి స్టోరీ ఇదేనా?

Sarkaru Vaari Paata Story: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచేసింది చిత్రబృందం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'కళావతి', 'పెన్నీ' సాంగ్స్ విడుదలవ్వగా.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

'సర్కారు వారి పాట' లిరికల్ సాంగ్ బ్యాగ్రౌండ్ లో బ్యాంకులకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించాయి. నోటరీ, సీల్ చేసిన అకౌంట్, మనీ బాండ్స్, డబ్బు వంటివి కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా స్టోరీపై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరుగుతోంది. పాటకు మధ్యలో మహేష్ బాబుకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ కనిపించాయి. 

అయితే ఇందులో మహేష్ బాబు బ్యాంకు అధికారిగా కనిపించనున్నారా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ గురించి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆ స్టోరీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కథ ఇదేనా?

'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబు పోషించిన పాత్ర తండ్రి ఓ బ్యాంకులో పని చేస్తారట. బ్యాంకులో పనిచేస్తున్న ఆయన తండ్రిని ఓ బడా వ్యాపారి మోసం చేసిన అధిక మొత్తంలో లోన్ పొందుతాడట. ఆ తర్వాత తీసుకున్న లోన్ కు వడ్డీ కట్టకపోవడమే కాకుండా విదేశాల్లో (దుబాయ్) తలదాచుకుంటాడట. 

ఈ లోన్ వ్యవహారంలో మహేష్ బాబు తండ్రిపై పైఅధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మహేష్ బాబు రంగంలోకి దిగుతాడట. ఆ తర్వాత మన హీరో తనదైన స్టైల్ లో డబ్బు ఎగ్గొట్టిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసుకొని.. అక్కడికి వెళ్లడమే కాకుండా, అతడ్ని ఇండియాకు తిరిగి తీసుకొస్తాడట. ఆ తర్వాత కథ సుఖాంతం అవుతుంది. అయితే ఈ కథ ఫస్టాఫ్ లో కామెడీ, లవ్ ట్రాక్ ను దర్శకుడు ప్లాన్ చేశారట. సెకండాఫ్ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. 

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవి శంకర్, రామ్ అచంట, గోపీ అచంట కలిసి జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు.  

Also Read: Malaika Arora Dating: నేను విడాకులు తీసుకున్నా.. కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి! హీరోయిన్ ఘాటు రిప్లై

Also Read: Mouni Roy Photos: పెళ్లైన తర్వాత మళ్లీ హాట్ ఫొటోషూట్ లో 'నాగిని' బ్యూటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News