Sanjay Dutt Injured: షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్.. సంజయ్ దత్ కి తీవ్ర గాయాలు

Sanjay Dutt Injured in Bomb Blast: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కన్నడలో కేడి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. బుధవారం నాడు జరుగుతున్న షూటింగ్లో ఒక బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ లో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 14, 2023, 03:07 PM IST
Sanjay Dutt Injured: షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్.. సంజయ్ దత్ కి తీవ్ర గాయాలు

Sanjay Dutt Injured During Movie Shoot: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఒకపక్క బాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క సౌత్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ హీరోగా రూపొందిన కేజిఎఫ్ 2 సినిమాలో అధీర పాత్రలో మెరిసిన సంజయ్ దత్ సౌత్ వారందరికీ మరింత చేరువయ్యాడు. ప్రస్తుతానికి ఆయన కన్నడలో కేడి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది.

ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ బెంగళూరు పరిచిన ప్రాంతాల్లో జరుగుతోంది. బుధవారం నాడు జరుగుతున్న షూటింగ్లో ఒక బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ జరిగిందని, ఆ బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ లో సంజయ్ దత్ కు గాయాలయ్యాయి అని తెలుస్తుంది. కేడి సినిమాకు సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో సంజయ్ దత్ కు గాయాలయ్యాయని ఆ సమయంలో ఆయన మోచేయి ముఖం తలకు తీవ్ర స్థాయిలో గాయాలైనట్లు చెబుతున్నారు.

ఆయనకు గాయాలవడంతో అప్పటికప్పుడు సినిమా షూటింగ్ నిలిపివేశారు. వెంటనే ఆయనకు బెంగుళూరులో చికిత్స అందించి నుంచి వెంటనే ముంబైకి తరలించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ గా డాక్టర్ రవి వర్మ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం లేటుగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం మీద పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Shakuntalam Special Show: సమంత రేంజ్ అంటే ఇదీ.. ఢిల్లీ బీజేపీ పెద్దల కోసం శాకుంతలం స్పెషల్ షో?

బెంగళూరులోని మాగాడి రోడ్డులోని సీగెనహళ్లి వద్ద జరుగుతున్న కేడీ షూటింగ్‌లో ప్రమాదం సంభవించి ప్రమాదం జరిగింది. బాంబు పేలుడు సమయంలో సంజయ్ దత్ కంటిపై గాజు ముక్క పడి గాయమైందని అంటున్నారు. గాయం కారణంగా, కేడీ చిత్ర బృందం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక కేడి సినిమా విషయానికొస్తే ధృవ సర్జా, జోగి ప్రేమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఫైటింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కే వి ఎన్ బ్యానర్ లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శిల్పా శెట్టి కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

ఇది కూడా చదవండి: Anchor Suma arrested: చేతికి సంకెళ్లతో సుమ.. అరెస్ట్ అయిందంటూ ప్రచారం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News