Animal: యానిమల్ ఓటిటి వర్షన్ పై క్లారిటీ ‌.. ప్రేక్షకుల ఓపికకు పరీక్ష

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న యానిమల్ సినిమాపై హిందీ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన ప్రతి నుంచి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరి ఎక్కువైపోయాయి. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో.. అనిల్ కపూర్ హీరో తండ్రిగా నటించగా…బాబీ డియోల్ క్రూరమైన విలన్ గా కనిపించబోతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2023, 08:19 AM IST
Animal: యానిమల్ ఓటిటి వర్షన్ పై క్లారిటీ ‌.. ప్రేక్షకుల ఓపికకు పరీక్ష

Animal OTT:దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. హీరోయిన్ రష్మిక మందన మినహా ఈ చిత్రానికి సంబంధించిన వారంతా కూడా హిందీ వారే. కానీ సందీప్ రెడ్డి పైన ఉన్న నమ్మకంతో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అని గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న భారీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు సినిమా యూనిట్.

కాగా ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో విడుదల కాకముందే ఈ చిత్రం యొక్క ఓటీటీ వెర్షన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెలిసిపోయింది. అసలు విషయానికి వస్తే ఈ సినిమా రన్ టైం గురించి మొదటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఈ చిత్రం ఏకంగా 3 గంటల 21 నిమిషాల ఫైనల్ కట్‌తో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. మూడు గంటల సినిమాకే ప్రేక్షకులు ఎలా చూస్తాము రా బాబు అనుకునే ఈ రోజుల్లో సందీప్ రెడ్డి ఏకంగా మూడు గంటల 21 నిమిషాల సినిమా తీసి అందరికీ షాక్ ఇచ్చారు. కాగా ఈ సినిమాని ఈ దర్శకుడు ఎంత బాగా తీసిన కానీ అంతసేపు ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలరా అనే సందేహాలు అందరికీ ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ బలం వల్ల.. నిడివి అనేది పెద్ద సమస్యే కాదని సందీప్ అండ్ కో అంటోంది.

ఇక ఈ థియేటర్ రన్ టైం వినే ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ ఉంటే ఇప్పుడు ఓటిటి రన్ టైం ఇంకొంచెం షాక్ కి గురి చేస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ 3 గంటల 50 నిమిషాల నిడివితో యానిమల్ సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా హీరో రణబీర్ కపూర్ ప్రెస్ మీట్ లో చెప్పడం విశేషం. కానీ థియేటర్లలో మరీ అంత నిడివితో సినిమా రిలీజ్ చేస్తే కంటెంట్ లో ఎంత బలం ఉన్నా.. ప్రేక్షకులను కూర్చోబెట్టడం కష్టమే అని దర్శకుడు ఫైనల్ గా ఈ చిత్రాన్ని కొంచెం కట్ చెయ్యడానికి ఒప్పుకున్నారట. దీనికి తోడు థియేటర్ల యాజమాన్యాలు రోజుకు నాలుగు షోలు నడపడం కూడా కష్టమై గగ్గోలు పెడతారు కాబట్టి ఈ చిత్ర టైం కత్తిరించక తప్పలేదు. 

కాగా యానిమల్ సినిమాని థియేటర్లలోకి 3.21 గంటల రన్ టైంతో వదిలినా.. ఓటీటీలో మాత్రం ఒరిజినల్ రన్ టైమే ఉంటుందట. ఓటీటీలో చూసే ప్రేక్షకులకి ఇది పెద్ద పరీక్ష అని చెప్పాలి. వారి ఓపికను బట్టి వారు చూసుకోవడం అంటే అన్నట్టు ఈ సినిమా ఫుల్ వర్షన్ ఓటిటి లో విడుదల చేయనున్నారట ఈ సినిమా మేకర్స్. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా  థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత అనగా ఫిబ్రవరి మొదటి వారంలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అని వినికిడి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News