'కరోనా'పై 'సంపూ' చిత్రం..!!

'కరోనా వైరస్' విస్తరిస్తున్న వేళ.. ఇప్పటి వరకు ఈ మహమ్మారిపై పాటలు  అలరించాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు  ఏకంగా తెలుగులో ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. 

Last Updated : May 10, 2020, 10:57 AM IST
'కరోనా'పై 'సంపూ' చిత్రం..!!

'కరోనా వైరస్' విస్తరిస్తున్న వేళ.. ఇప్పటి వరకు ఈ మహమ్మారిపై పాటలు  అలరించాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు  ఏకంగా తెలుగులో ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. 

టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు.. కరోనా వైరస్ పై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొబ్బరిమట్ట  సినిమా తర్వాత ఆయన కొత్త చిత్రం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. 

టైటిల్ స్థానంలో క్వశ్చన్ మార్క్( '?' ) ఉండడం విశేషం. ఇంతకీ ఈ సినిమాకు టైటిల్ పెడతారా..? లేక అలాగే ఉంటుందా..? అనేది విశేషం. ఈ సినిమాను సంపూర్ణేష్ బాబుతో తొలి చిత్రం హృదయకాలేయం నిర్మించిన టీమ్ తీస్తుండడం  మరో విశేషం. చైనాలోని  ఊహాన్ గబ్బిలాల మార్కెట్లో తీసిన చివరి సినిమా అంటూ పోస్టర్ పై రాశారు.  దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. 


మరోవైపు పోస్టర్ లో చూస్తే సంపూర్ణేష్ బాబు గ్యాంగ్ స్టర్ లుక్ లో కనిపించారు. పైగా ఆయన చుట్టూ అన్ని గబ్బిలాలు ఉన్నాయి. మొత్తంగా సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సినిమాను జులై 30న విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News