Samantha : నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు!..అది చూపిస్తూ సమంత పోస్ట్.. ఉద్దేశ్యం ఏంటి?

Samantha Ruth Prabhu Latest Quote సమంత చెప్పే కొటేషన్లు, వేసే పోస్టులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె పెట్టిన ఎన్నో కోటేషన్స్ కాంట్రవర్సీలకు దారితీశాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 10:17 AM IST
  • నెట్టింట్లో సమంత సందడి
  • వరుస పోస్ట్‌లతో సామ్ హల్చల్
  • తాజాగా అలాంటి కొటేషన్ చెప్పిన సందడి
Samantha : నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు!..అది చూపిస్తూ సమంత పోస్ట్.. ఉద్దేశ్యం ఏంటి?

Samantha Ruth Prabhu Quote : సమంత తాజాగా అందరిలోనూ కొత్త అనుమానాలు రేకెత్తించేసింది. సమంత అసలే గత కొన్ని రోజులు సోషల్ మీడియాలో సైలెంట్‌గా ఉంది. మళ్లీ ఇప్పుడు తన పాత పద్దతిలోకి వచ్చింది. వరుసగా తన స్టైల్లో కొటేషన్స్ పెట్టేస్తోంది. నిన్న కూడా ఇలాంటి ఓ పోస్టే పెట్టేసింది. వెనక్కి తగ్గాను..ఓడిపోలేదు అనే అర్థం వచ్చేట్టుగా పోస్ట్ వేసింది. ఇక ఇప్పుడు మరో పోస్ట్ వేసింది సమంత. ఇందులో సమంత కనిపించిన తీరుకు అంతా ఆశ్చర్యపోతోన్నారు.

ఆమె లుక్ మీద, బాడీ మీద దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అదో వైపు ట్రోలింగ్ నడుస్తుంటే.. ఆమె చెప్పిన కొటేషన్, టీ షర్ట్ మీదున్న కొటేషన్ వైరల్ అవుతోంది. టీ షర్ట్ మీదున్న కొటేషన్‌ను చూపించింది సమంత. పైగా అదే కొటేషన్‌ను మళ్లీ ట్వీట్ చేసింది. ఇన్ స్టాలోనూ పోస్ట్ వేసింది. అయితే ఇప్పుడు ఆ కొటేషన్ మీదే చర్చ జరుగుతోంది. నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు.. అంటూ సమంత చెప్పుకొచ్చింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరి అది ఎవరిని ఉద్దేశించి అంటోందనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. కానీ సమంతకు మాత్రం ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. మోర్ పవర్ అంటూ ఎమోజీలతో సమంతకు మద్దతు నిలుస్తున్నారు. మొత్తానికి సమంత మాత్రం ఇలా బ్యాక్ రావడం ఆనందంగా ఉందని అభిమానులు సంబరపడిపోతోన్నారు.

సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తుంది. ఆల్రెడీ కాశ్మీర్‌లో మొదటి షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే.

ఇక సమంత మీద ఈ మధ్య కాలంలో వచ్చిన రూమర్ల సంగతి తెలిసిందే. సమంత వింత రోగంతో బాధపడుతోందని, గతంలోనూ ఆమెకు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడిందని, ఇప్పుడు అది మరింత తీవ్రంగా మారిందని, అందుకే బయటకు రావడం లేదంటూ ఇలా రకరకాల రూమర్లు వచ్చాయి. దీనిపై ఆమె మెనేజర్ స్పందించాడు. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Also Read : Allu Aravind on Chiranjeevi: చిరుతో వివాదాలపై పెదవి విప్పిన అరవింద్..అసలు విషయం బయట పెట్టేశాడుగా

Also Read : RGV on Garikapati: గరికపాటికి పద్మ కూడా ఎక్కువే.. పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు? వర్మ సంచలన ట్వీట్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News