Gap Between Samantha - Preetham Jukalker: సమంతకు ప్రీతమ్‌కు మధ్య గ్యాప్.. వాళ్లకు దూరంగా ఉంటోన్న సామ్..?

Samantha - Preetham: సమంత ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ ఇద్దరి మధ్య లింక్‌ క్రియేట్ చేసిన రూమర్లెన్నో బయటకు వచ్చాయి. విడాకులకు ప్రీతమే కారణమంటూ టాక్స్ వినిపించాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2023, 12:18 PM IST
  • సమంత స్టైలీష్ట్‌గా ప్రీతమ్‌కు ఫేమ్
  • సమంత ప్రీతమ్ మధ్య రిలేషన్‌ మీద చర్చలు
  • ప్రీతమ్‌కు దూరంగా ఉంటోన్న సమంత?
Gap Between Samantha - Preetham Jukalker: సమంతకు ప్రీతమ్‌కు మధ్య గ్యాప్.. వాళ్లకు దూరంగా ఉంటోన్న సామ్..?

Reason Gap Between Samantha - Preetham : సమంత ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతోంది. సినిమా షూటింగ్‌లంటూ బిజీగా ఉంటోంది. గత ఆరేడు నెలలుగా సమంత ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత సినిమాలకు దూరమైంది. ఇప్పుడే సమంత పూర్తి ఆరోగ్యంతో రెట్టింపు వేగంతో బయటకు వచ్చినట్టుగా అనిపిస్తోంది. 

గుళ్లో మెట్లు ఎక్కుతూ మొక్కులు తీర్చుకుంటోంది. జిమ్‌లో భారీ వర్కౌట్లు చేస్తూ ఉంది. సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే సమంత ఇప్పుడు తన గ్యాంగ్‌తో ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు అయితే సమంత చుట్టూ ప్రీతమ్, సాధన సింగ్‌ వంటి వారు ఉండేవారు.

సమంత స్టైలిష్ట్‌గా ప్రీతమ్, మేకప్ మెన్‌గా సాధన సింగ్ వంటివారు సెట్స్ మీద సందడి చేస్తుండేవారు. ఈ ముగ్గురూ కలిసి తెగ అల్లరి చేసేవారు. కానీ ఇప్పుడు సమంతకు దూరంగా ఈ ఇద్దరూ కనిపిస్తున్నారు. సాధన, ప్రీతమ్, సమంతలు కలిసి కనిపించి చాలా రోజులే అయింది.

అప్పుడప్పుడు సమంత పోస్టులకు ప్రీతమ్, సాధన స్పందిస్తుంటారు. కానీ ఈ ముగ్గురూ కలిసి వెకేషన్లకు వెళ్లడం గానీ, కలిసి సందడి చేయడం గానీ కనిపించడం లేదు. ఇప్పుడు కూడా సమంత నైనిటాల్‌లో ఉంటే.. ప్రీతమ్ మాత్రం ఇక్కడే యాదాద్రిలో సందడి చేస్తున్నాడు. దీంతో వీరి మధ్య గ్యాప్ ఏర్పడినట్టుగా అనిపిస్తోంది. సమంతకు దూరంగానే ప్రీతమ్, సాధన ఉంటున్నారా..? లేదా..? సమంతే వారికి దూరంగా ఉంటోందా..? అన్నది తెలియడం లేదు.

సమంత ప్రీతమ్ మధ్య అక్రమ సంబంధాలను సోషల్ మీడియా అంటగట్టేసింది. దానిపై సమంత మండిపడింది. సమంతను తాను అక్కా అని పిలుస్తాను అంటూ ప్రీతమ్ ఆవేదన చెందాడు. తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి నాగ చైతన్యకి కూడా తెలుసని, తమ గురించి అలాంటి వార్తలు వస్తూ ఉంటే.. చైతూ స్పందించకపోవడం బాధగా అనిపించిందంటూ ప్రీతమ్ తన ఆవేదనను వెల్లగక్కాడు.

Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News