Samantha New Item Song: సమంత మరో క్రేజీ ఐటం సాంగ్.. ఇక రచ్చ రచ్చే!

Samantha New Item Song: విడాకుల తర్వాత పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2022, 11:15 AM IST
  • పుష్ప ఐటం సాంగ్ తో సమంతకు క్రేజ్
  • మరో పాన్ ఇండియా మూవీలో క్రేజీ ఆఫర్
  • నెక్స్ట్ లెవల్ ప్లానింగ్ అంటూ ప్రచారం
Samantha New Item Song: సమంత మరో క్రేజీ ఐటం సాంగ్.. ఇక రచ్చ రచ్చే!

Samantha Approached For One More Item Songs: విడాకులు ప్రకటన తర్వాత సమంతకు ఉన్న క్రేజ్ పోతుంది అనుకుంటే మరిన్ని ఆఫర్లు అందుకుంటూ ముందుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసిన సమంత నార్తులో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఆ వెబ్ సిరీస్లో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ కారణంగా విడాకులు అయ్యాయి అంటూ ప్రచారం జరిగింది. ఏది ఏమైనా విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటం సాంగ్ మాత్రం మంచి క్రేజ్ తీసుకొచ్చింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమెకు మరో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.

నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన తర్వాత సమంత వరుస సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె నటించిన పలు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో ఒక సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో ఊ అంటావా మామా, ఊహూ అంటావా మామ అనే ఐటెం సాంగ్ చేసిన సమంత ఆ సాంగ్ తో భారత దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించింది. 

నిజానికి మొదట ఈ ఐటం సాంగ్ చేయడానికి సమంత ఆసక్తి చూపించలేదు కానీ అల్లు అర్జున్, సుకుమార్ ఆమెను ఒప్పించి మరీ ఐటం సాంగ్ చేయించారు. అయితే అయిష్టంగానే ఈ ఐటం సాంగ్ చేసిన ఆమెకు ఇప్పుడు ఎనలేని క్రేజ్ లభించింది. ఈ క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు ఆమెను మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో ఐటం సాంగ్ చేయమని అడుగుతున్నారట. అర్జున్ రెడ్డి సినిమా తో క్రేజీ డైరెక్టర్ గా మారి తరువాత రెండో సినిమాతోనే బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిన సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటం సాంగ్ ప్లాన్ చేశారని, బాలీవుడ్ సహా టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోయిన్‌లను సంప్రదించినా తర్వాత సమంత అయితే కరెక్ట్ గా ఉంటుందని వారు భావిస్తున్నారు అని తెలుస్తోంది. 

పుష్ప సాంగ్ ను మించేలా ఈ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సమంత ఈ ఐటం సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా లేదా అనే విషయం మీద ప్రస్తుతానికి సందిగ్ధత నెలకొంది. అయితే సమంత అనే కాదు హీరోయిన్లు అందరూ కూడా ఐటం సాంగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఎంత రెమ్యూనరేషన్ లభిస్తుందో ఐటం సాంగ్ చేసినా అంతే రెమ్యూనరేషన్ లభిస్తోంది. దానికి తగ్గ క్రేజ్ లభించడమే కాక తక్కువ సమయంలో షూటింగ్ పూర్తవుతూ ఉండడంతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవడానికి ఐటం  సాంగ్స్ చేయడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు.

Also Read: Naga Chaitanya First Love: సమంత కంటే ముందే లవ్ స్టోరీ.. అలా బయట పెట్టిన నాగచైతన్య

Also Read: Mythri Movie Makers: అదిరిపోయే ప్లాన్ వేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఆ మలయాళ హీరోతో క్రేజీ మూవీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News