Samantha-Allu Arjun: ఐదు నిమిషాల పాటకు రూ.5కోట్లు తీసుకున్న సామ్... దానికి అల్లు అర్జునే కారణమట..!

Actress Samantha: పుష్పలోని స్పెషల్ సాంగ్ లో నటించి..విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత. ఈ సాంగ్ చేయడానికే కారణం బన్నీనే టాక్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 07:33 PM IST
  • కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న పుష్ప
  • ఐటెం సాంగ్ రూ.5కోట్లు తీసుకున్న సామ్
  • పాట చేయడానికి బన్నీనే కారణమట
Samantha-Allu Arjun: ఐదు నిమిషాల పాటకు రూ.5కోట్లు తీసుకున్న సామ్... దానికి అల్లు అర్జునే కారణమట..!

Samantha-Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- టాప్ డెరైక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప (Pushpa Movie). ఇటీవల రిలీజ్ అయిన చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది.  ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇదంతా ఒక ఎత్తెతే..చిత్రంలోని సమంత స్పెషల్ సాంగ్ (Samantha Special Song) మరో ఎత్తు. ‘'ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా' పాటతో ఓ ఊపు ఊపేసింది సమంత. ఈ సాంగ్ ఎంత వివాదమయ్యిందో..సమంతపై అంతకంటే ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. కృతి సనన్, సంజీదా షేక్ వంటి నటీనటులు సామ్ ను ప్రశంసించారు. అయితే దీని అంతటి కారణం బన్నీనే కారణమని ఓ నివేదిక వెల్లడించింది. 

ఈ ఐటెం సాంగ్ ను చేయడానికి మెుదట సమంత నిరాకరించిదంట. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఒప్పించటంతో..ఆమె ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఆంగీకరించిందట. సాంగ్ ప్రత్యేకతను, తానే చేయాల్సిన అవసరాన్ని వివరించి ఈ పాట చేసేలా ఒప్పించాడట బన్నీ. ఈ పాటకు సామ్ రూ. 5 కోట్లు పారితోషికం (Samantha remuneration for Pushpa item song) తీసుకుంది. దేవీ శ్రీ  ప్రసాద్ సంగీతమందించిన ఈ సాంగ్ అప్ లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. దీంతో సమంత వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం సామ్.. నయనతార, విజయ్ సేతుపతితో కలిసి'కత్తువాకుల రెండు కాదల్' చిత్రంలోనూ, తన తొలి అంతర్జాతీయ చిత్రం 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్'లోనూ నటిస్తోంది. 

Also Read: Ghani Movie Special Song: గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి రచ్చచేసిన తమన్నా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News