Samantha enjoys skiing : మంచుకొండల్లో సమంతా స్కీయింగ్, అది అంత సులభంకాదంటూనే..

Samantha in Switzerland trip : సమంత యూరప్ ట్రిప్‌లో స్విట్జర్లాండ్ మంచుకొండల్లో స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 12:50 AM IST
  • యూరప్ ట్రిప్‌లో ఉన్న సమంత
  • స్విట్జర్లాండ్ మంచుకొండల్లో స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోన్న సామ్
Samantha enjoys skiing : మంచుకొండల్లో సమంతా స్కీయింగ్, అది అంత సులభంకాదంటూనే..

Samantha Skiing Experience : కొన్ని రోజుల క్రితం సమంత, నాగచైతన్య తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ మధ్య పుష్ప (Pushpa) మూవీలో స్పెషల్‌ సాంగ్‌తో అలరించిన సామ్‌ ఇప్పుడు విహారయాత్రలో ఆనందంగా గడుపుతోంది.

ప్రస్తుతం యూరప్ ట్రిప్‌లో ఉన్న సమంత (Samantha) స్విట్జర్లాండ్ మంచుకొండల్లో స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. వెర్బియర్ ప్రాంతంలో స్కీయింగ్ (Skiing) చేసింది సామ్. మీ అహాన్ని ఇంట్లోనే వదిలేయండి అనే క్యాప్షన్ జోడిస్తూ స్కీయింగ్ చేస్తోన్న వీడియోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇక అంతకు ముందు స్కీయింగ్ అంత సులభమేమీ కాదు.. కానీ ఇది ఎంతో సరదాగా ఉంటుందని పేర్కొంటూ ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసింది సామ్.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

Also Read : Jai bhim oscar: ఆస్కార్​ రేసులో సూర్య 'జై భీమ్'​ సినిమా!

ఇక సమంత మరోవైపు వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. గుణశేఖర్ డైరెక్షన్‌లో శాకుంతలం మూవీలో నటిస్తోంది. సామ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న యశోద మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు పలు బాలీవుడ్ మూవీలకు కూడా సామ్ (Sam) ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
 

Also Read : Bhumika Chawla Swimming: భూమిక బికినీ అందాలు అదరహో.. గ్లామర్ టచ్ మాములుగా లేదుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News