Samantha Remuneration: సమంత షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోందంటే..

Samantha Remuneration: స్టార్ హీరోయిన్ సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఒక్కో సినిమాకు ఇప్పుడు సమంత ఎంత డిమాండ్ చేస్తోందంటే... 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 04:47 PM IST
  • రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సామ్
  • సౌత్‌లో నయనతార తర్వాత రెండో స్థానంలో
  • ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోందంటే..
Samantha Remuneration: సమంత షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోందంటే..

Samantha Remuneration: సౌత్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలుగొందుతున్న సమంత రెమ్యునరేషన్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సౌత్‌లో హీరోయిన్ నయనతార అందరి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుండగా.. సమంత ఆమె తర్వాతి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లు, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తున్న సమంత హాలీవుడ్ రేంజ్‌కి చేరిన సంగతి తెలిసిందే. దీంతో సమంత తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు చెబుతున్నారు. 

ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందట. అయితే ప్రొడక్షన్ హౌస్‌తో పాటు ఇతర ఫ్యాక్టర్స్‌ను బట్టి రెమ్యునరేషన్‌లో తేడాలు ఉండొచ్చునని చెబుతున్నారు. సమంతకు అంత మార్కెట్ ఉంది కాబట్టే నిర్మాతలను సామ్ ఆ స్థాయిలో డిమాండ్ చేస్తోందంటున్నారు. పుష్ప సినిమాలో మొదటిసారి ఐటెం సాంగ్‌లో మెరిసిన సమంత.. అందుకు గాను ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుందనే ప్రచారం ఉంది. 

తమిళంలో విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో సమంత నటించిన 'కాతు వాకుల రెండు కాదల్' ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో సమంతతో పాటు నయనతార, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన 'శాకుంతలం' సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న మరో చిత్రం 'యశోద' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. 

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్‌కు తప్పని కొత్త జీవో చిక్కులు.. ఇంకా ఓపెన్ కాని టికెట్స్ కౌంటర్స్!!

Also Read: Stocks today: మూడో రోజూ లాభాలు- లోహ, బ్యాంకింగ్ షేర్లు భళా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News