Sai Pallavi Explanation: గో రక్షకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రముఖ సినీ నటి సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సాయి పల్లవిపై సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ట్రోల్స్ మొదలయ్యాయి. అందులో కొంతమంది ఆమెని తీవ్రంగా వ్యతిరేకించి విమర్శలు చేయగా.. ఇంకొంత మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే, తాజాగా సాయి పల్లవి ఆ వివాదంపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. మొట్టమొదటిసారిగా ఇలా ఓ అంశంపై తాను వివరణ ఇస్తున్నానని చెప్పిన సాయి పల్లవి.. '' ఇప్పుడు కూడా ఏదైనా మాట్లాడటానికి ముందుగా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది'' అని ఈ వీడియోలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. చివరకు పేరొందిన వార్తా సంస్థలు సైతం తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండానే తమకు తోచింది రాసుకుపోయాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి తనపై చేసిన ఆరోపణల కారణంగా గత కొద్దిరోజులుగా తాను మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యాయనని చెప్పుకొచ్చారు.
తాను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక అంశాలపై తన అభిప్రాయం చెప్పానని.. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ భావాల గురించి ప్రశ్న తలెత్తగా, మన భావజాలం కంటే ముందుగా మనమంతా మనుషులం అనేదే తనకు ముఖ్యమని చెప్పానని తెలిపారు. కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు. అలాగే కొవిడ్ సమయంలో గో రక్షణ నేపథ్యంతో జరిగిన మూక దాడుల గురించి కూడా ప్రస్తావిస్తూ.. '' దాడులు, విధ్వంసం ఎలాంటివైనా.. ఏ మతం రూపంలో ఉన్నా వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది'' అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ వ్యాఖ్యలనే తప్పుగా అర్థం చేసుకుని తనపై ఏవేవో ఆరోపణలు, విమర్శలు చేశారని అన్నారు. మెడిసిన్ గ్రాడ్యూయేట్‌ని అయిన తనకు సున్నితమైన అంశాల విషయంలో ఒకరిని నొప్పించేలా మాట్లాడే ఉద్దేశం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
చిన్నప్పుడు బడిలో చదువుకునే రోజుల నుంచే.. ''భారత దేశం నా మాతృదేశం, భారతీయులంతా నా సహోదరులు'' అంటూ ప్రార్థన చేస్తూ పెరిగామని.. ఇప్పటికీ అదే మనస్తత్వంతో ఉండే తాను తోటి వారితో న్యూట్రల్‌గానే ఉంటాను కానీ ఎవ్వరినీ నొప్పించేలా తాను వ్యవహరించనని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా తాను మానసికంగా ఆందోళనలో ఉన్న సమయంలో ఎంతో మంది తనకు అండగా నిలిచి, ధైర్యం చెప్పారని.. తాను ఒంటరిని కాదని ధైర్యం చెప్పిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని సాయి పల్లవి తన వీడియో స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. సాయి పల్లవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఆమెపై రాజుకున్న ఆగ్రహావేశాలను చల్లారుస్తుందా లేదా అనేది వేచిచూడాల్సిందే మరి.
Also read : Malavika Mohanan Pics: గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్.. క్లీవేజ్ అందాలతో రచ్చ!
Also read : Poonam Bajwa Pics: బ్లాక్ డ్రెస్సులో పూనమ్ బజ్వా.. బొద్దుగుమ్మ బరువైన అందాలు చూడతరమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook