RRR@2Years:2 యేళ్లు పూర్తి చేసుకున్న బ్లాక్ బాస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ.. సాధించిన రికార్డులు..అవార్డులు.. మొత్తం వసూళ్లు ఇవే..

RRR@2Years: ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఆర్ఆర్ఆర్' (RRR)(రౌద్రం రణం రుధిరం). సరిగ్గా రెండేళ్ల క్రితం విడుదలైన ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఈ సినిమా సాధించిన రికార్డులు.. అవార్డులు.. మొత్తం వసూళ్ల విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 25, 2024, 12:53 PM IST
RRR@2Years:2 యేళ్లు పూర్తి చేసుకున్న బ్లాక్ బాస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ.. సాధించిన రికార్డులు..అవార్డులు.. మొత్తం వసూళ్లు ఇవే..

RRR@2Years: RRR (రౌద్రం రణం రుధిరం) రెండేళ్ల క్రితం (25/3/2022)న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు మన దేశానికి పూర్తి స్థాయిలో ఆస్కార్ అవార్డును తీసుకొచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సినిమాలోని నాటు నాటు పాటకు 'ఆస్కార్ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీకి  ఆస్కార్ కాకుండా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను కొల్లగొట్టింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్.. బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్, బెస్ట్ ఆర్ఆర్ స్కోర్.. బెస్ట్ కొరియోగ్రాఫర్, స్టంట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ సినిమా పలు అవార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తే.. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. అటు అజయ్ దేవగణ్.. అల్లూరి వెంకటరామరాజు పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో ఒలివియా మోరీస్, ఆలియా భట్, శ్రియ నటించారు. ఈ సినిమాలో లోకల్ నుంచి నేషనల్ ఆపై ఇంటర్నేషనల్ లెవల్లో పలు అవార్డులను కొల్లగొట్టింది.

ఈ సినిమాలోని నాటు నాటు పాటకు చంద్రబోస్ రాసిన సాహిత్యం.. కీరవాణి సంగీతం.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ..రాజమౌళి టేకింగ్‌కు నాటు నాటు పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ బీభత్సమైన స్టెప్పులు..వారికి రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ గాత్రం గ్లోబల్ లెవల్లో అందరినీ ఆకట్టుకున్నాయి.  

ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం ఇదే తొలిసారి. అంతేకాదు మన దేశం తరుపున ఓ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం అనేది ఇదే మొదటి సారి అని చెప్పాలి. ఉత్తమ చిత్రం విభాగంలో కాకుండా.. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ అవార్డు రావడం భారతీయులు ఆనందించదగ్గ విషయమనే చెప్పాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశంలోనే జపాన్ దేశంలో సంచలన రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యారు. ఈ సినిమాతో రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా రూ. 614.06 కోట్ల షేర్ (1152.40 కోట్ల) కలెక్షన్స్ రాబట్టింది.

ఇక జపాన్ దేశంలో ఈ సినిమా యేడాది పూర్తి చేసుకొని ఇంకా రన్ కొనసాగిస్తూనే ఉంది. 145.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రీ రిలీజ్‌లో ఈ సినిమా రూ. 2.50 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 1300.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

నైజాం (తెలంగాణ).. రూ. 111.85 కోట్ల షేర్
సీడెడ్ (రాయలసీమ).. రూ. 51.04 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర.. రూ. 36.40 కోట్ల షేర్
తూర్పు గోదావరి.. రూ. 16.24 కోట్ల షేర్
పశ్చిమ గోదావరి.. రూ. 13.31 కోట్ల షేర్
గుంటూరు.. రూ. 18.21 కోట్ల షేర్
కృష్ణ. రూ. 14.76 కోట్ల షేర్
నెల్లూరు.. రూ. 10.50 కోట్ల షస్త్రర్
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 272.31 కోట్ల షేర్ (రూ. 415 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.

కర్ణాటక.. రూ. 44.50 కోట్ల షేర్ (రూ. 83.40 కోట్ల గ్రాస్)
తమిళనాడు.. రూ. 38.90 కోట్ల షేర్ (రూ. 77.25 కోట్ల గ్రాస్)
కేరళ.. రూ. 11.05 కోట్ల షేర్ (రూ. 24.25 కోట్ల గ్రాస్)
హిందీ.. రూ. 134.50 కోట్ల షేర్ (రూ. 326 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ భారత్ .. రూ. 9.30 కోట్ల షేర్ (రూ. 18.20 కోట్ల గ్రాస్)
ఓవర్సీస్.. రూ. 103.50 కోట్ల షేర్ (రూ. 208.30 కోట్ల గ్రాస్)
ప్రపంచ వ్యాప్తంగా రూ. 614.06 కోట్ల షేర్ (రూ. 1152.40 కోట్ల గ్రాస్)

జపాన్ దేశంలో రూ. 145.50 కోట్ల గ్రాస్
రీ రిలీజ్‌ లో కలిపి రూ. 2.50 కోట్ల గ్రాస్..

ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు.

Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News