Komuram Bheemudo song lyrics meaning: కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రసునెగడాలే మండాలి కొడుకో.. కొమురం భీముడో.. కొమురం భీముడో.. రగరాగ సూరీడై రగలాలీ కొడుకో రగలాలీ కొడుకో.. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కాకముందే ఈ పాట అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా విడుదల తర్వాత ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. తారక్ ఫ్యాన్స్‌ని అనే కాకుండా అన్నివర్గాల ఆడియెన్స్‌ని ఈ పాట విజువల్‌తో సహా కట్టిపడేసింది. ఇంకా చెప్పాలంటే కొమురం భీముడో.. పాట ఆర్ఆర్ఆర్ మూవీని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లిన పాట అనే చెప్పుకోవచ్చు.
సినిమా చూసే ప్రతీ ఒక్కరి హృదయాలను తట్టి లేపిన ఈ పాటకు ప్రాణం పోసింది మరెవరో కాదు.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజనే. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన పాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. ఆయన పాట రాస్తే... పదాలకు ఆయుధాలిచ్చి పౌరుషంగా యుద్ధానికి పంపినట్టే.
తెలంగాణ సాహిత్యాన్ని నరనరాన జీర్ణించుకున్న సుద్దాల అశోక్ తేజ.. తెలంగాణ గడ్డపై పుట్టిన మరో అమర వీరుడు పాత్ర కోసం రాసిన ఈ పాటలో ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం. తెల్లోడితో పాటు వాడితో కలిసి నిజాంలు సాగించిన నిరంకుశపాలనకు చరమగీతం పాడేందుకు పౌరుషం కట్టలు తెంచుకున్న అడివిబిడ్డ ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న వైనాన్ని సుద్దాల అశోక్ తేజ పూసగుచ్చినట్టు వివరించిన తీరు ఔరా అనుకునేలా చేస్తోంది. అందుకే ఆ పాటకు సంబంధించిన మరిన్ని విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మా జీ తెలుగు న్యూస్. ఆర్ఆర్ఆర్ మూవీకి కథ రాసిన విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి జీ న్యూస్ తెలుగుతో ముచ్చటించిన సుద్దాల అశోక్ తేజ.. ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కోరిక మేరకు రాసిన కొమురం భీముడో పాటకు నిర్వచనం ఏంటో చెప్పుకొచ్చారు. అదేంటో ఆయన మాటల్లో మీరే వినండి.
Also read : RRR New Record: ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. 3 రోజుల్లో రూ.500 కోట్ల మార్క్..
Also read : RGV Comments: 30 ఏళ్లలో ఇలాంటి సినిమా చూడలేదంటున్న ఆర్జీవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook