Asish Reddy: సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకునేసిన రౌడీ బాయ్స్ హీరో.. దిల్ రాజు ఇంట్లో పెళ్లి సందడి

Dil Raju: తెలుగు సినీ ప్రేక్షకుల కి నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న నిర్మాతలు ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ముందుగా తెరపైకి వచ్చిన హీరో ఆశీష్.. ఇక ఈ హీరో నిశ్చితార్థం నిన్న సైలెంట్ గా ఇరువురి కుటుంబాల మధ్య జరిగిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 08:05 AM IST
Asish Reddy: సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకునేసిన రౌడీ బాయ్స్ హీరో.. దిల్ రాజు ఇంట్లో పెళ్లి సందడి

  Asish wedding: రౌడీ బాయ్స్ అనే సినిమాతో మన ముందుకి వచ్చిన హీరో ఆశిష్. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఈయన. దిల్ రాజు తో పాటు ఆయన సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలోకి వచ్చి దిల్ రాజుతో కలిసి పనిచేస్తున్నారు. ఇక శిరీష్ కొడుకు ఆశిష్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా చేసిన రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ హీరో త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో కూడా రాబోతున్నాడు. అంతేకాదు రెండో సినిమా రిలీజ్ కి ముందే మూడో సినిమా కూడా అనౌన్స్ చేశాడు

 

ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న ఆశిష్ ప్రేక్షకులకు మరో షాక్ కూడా ఇచ్చారు. తన మొదటి సినిమా చేసిన వెంటనే ఇప్పుడు నిశ్చితార్థం చేసుకునేసారు ఈ హీరో. తెలంగాణ వాళ్లయిన వీళ్లు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ వ్యాపారవేత్త తో సంబంధం కుదుర్చుకోవడం విశేషం. అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. ఆశిష్ – అద్విత నిశ్చితార్థానికి చెందిన ఫోటోలు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అంతేకాదు అమ్మాయి ఆశిష్ కి ఉంగరం వేస్తూ ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి అని తమాషాగా అడిగిన వీరిద్దరి ఎంగేజ్మెంట్ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక పలువురు నెటిజన్స్, ప్రముఖులు ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫంక్షన్ దిల్ రాజు ఇంట్లో జరిగింది అని ఇక వీరి వివాహం త్వరలోనే జరగనుంది అని సమాచారం.

కాగా ప్రస్తుతం దిల్ రాజు తీస్తున్న సినిమాలలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజెర్. అయితే ఈ చిత్రం దర్శకులు శంకర్ వలన పోస్ట్ ఫోన్ అవుతూనే వస్తోంది. ఈ సినిమా కోసం అత్యంత భారీ బడ్జెట్ ఇన్వెస్ట్ చేశారు ఈ నిర్మాత. భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్న శంకర్.. ఇక ఎప్పుడు ఈ చిత్రం పూర్తి చేసి విడుదల చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

  

Trending News