Romantic movie review: టాలీవుడ్ డైరెక్టర్స్ చెప్పిన రొమాంటిక్ మూవీ రివ్యూ

Romantic movie reviewed by tollywood directors: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఇవాళే విడుదలైన రొమాంటిక్ మూవీ చూసిన తెలుగు సినీ ప్రముఖులు... సినిమాలో ఆకాశ్ పర్‌ఫార్మెన్స్‌ అదుర్స్ అంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 09:06 PM IST
Romantic movie review: టాలీవుడ్ డైరెక్టర్స్ చెప్పిన రొమాంటిక్ మూవీ రివ్యూ

Romantic movie reviewed by tollywood directors: రొమాంటిక్ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఇవాళే విడుదలైన రొమాంటిక్ మూవీ చూసిన తెలుగు సినీ ప్రముఖులు... సినిమాలో ఆకాశ్ పర్‌ఫార్మెన్స్‌ అదుర్స్ అంటున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం పూరి జగన్నాథ్ స్పెషల్ షో ఏర్పాటు చేయగా.. చిత్ర ప్రదర్శన అనంతరం సినిమా వీక్షించిన సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. 

రొమాంటిక్ మూవీ గురించి దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli about Romantic movie) మాట్లాడుతూ.. సినిమా, సినిమాలో హీరో పర్‌ఫార్మెన్స్‌.. రెండూ బాగున్నాయని కితాబిచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో ఫెంటాస్టిక్ హీరో వచ్చాడంటూ ఆకాశ్‌ని ఆకాశానికెత్తేశాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ ఇష్టపడే నేటి యువతకు రొమాంటిక్ సినిమా ఒక పండగలాంటిదే అని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. లవ్ స్టోరీ, సాంగ్స్ చాలా బాగున్నాయి. మీరు టికెట్‌కి పెట్టే డబ్బుకు తగిన ఎంటర్‌టైన్మెంట్‌ను ఈ సినిమా అందిస్తుంది అని అన్నారు.

F2, సరిలేరు నీకెవ్వరు, రాజా ది గ్రేట్, సుప్రీం లాంటి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. ఆకాష్ వన్ మ్యాన్ షో అదిరిపోయిందన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటెన్స్ అండ్ రొమాంటిక్ మూవీ. జగన్ డైలాగ్స్ బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయి. కుర్రాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకు వెళ్ళిపోవచ్చు అంటూ రొమాంటిక్ మూవీ (Romantic movie) గురించి ఆడియెన్స్‌కి తన రివ్యూను చెప్పేశాడు. 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గుణ శేఖర్ రొమాంటిక్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు జగన్ సినిమాల్లో ఆయన డైలాగ్స్‌ని హీరోలు అందరూ చెప్తుంటే విని ఎంజాయ్ చేశాం. కానీ ఇప్పుడు ఆకాష్ పూరి (Akash Puri) వాళ్ళ నాన్న పూరి రాసిన డైలాగ్స్ చెప్తుంటే వినడం చాలా బాగుంది అని చెప్పుకొచ్చారు.

''దేశాన్ని ప్రేమిస్తే రూపాయి ఖర్చు కాదు కానీ ఆడదాన్ని ప్రేమిస్తే మాత్రం దూల తీరిపొద్ది'' లాంటి డైలాగ్స్ (Romantic movie dialogues) రాయాలంటే అది పూరి సర్‌కే చెల్లుతుందని డైరక్టర్ హరీశ్ శంకర్ అన్నారు.

Trending News