Sarkaru vaari pata: సర్కారు వారి పాట నుంచి కళావతి లిరికల్ సాంగ్ విడుదల

మహేశ్​ బాబు, కీర్తీ సురేశ్​ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా నుంచి అప్​డేట్​ వచ్చింది. వాలెంటైన్స్ డే కానుకగా.. ఈ సినిమాలో 'కళావతి' లిరికల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 05:04 PM IST
  • సర్కారు వారి పాట నుంచి అప్​డేట్​
  • అధికారికంగా విడుదలైన కళావతి లిరికల్ సాంగ్​
  • సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న తమన్​, సిద్​ శ్రీరామ్​
Sarkaru vaari pata: సర్కారు వారి పాట నుంచి కళావతి లిరికల్ సాంగ్ విడుదల

Sarkaru vaari pata lyrical song: మహేశ్​ బాబు, కీర్తీ సురేశ్​ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా నుంచి అప్​డేట్​ వచ్చింది. వాలెంటైన్స్ డే కానుకగా.. ఈ సినిమాలో 'కళావతి' లిరికల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​.

'వందో ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా..  ఏందే నీ మాయా..' అంటూ ఈ పాట సాగుతుంది.

ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. సిద్ శ్రీరామ్​ పాడారు. ఈ సినిమాకు ఎస్​.ఎస్. తమన్​ మ్యూజిక్ అందిచారు.

ఆకట్టుకున్న మ్యుజిక్ డైరెక్టర్, సింగర్​..

ఇది లిరికల్ సాంగ్ కావడంతో.. కాస్త డిఫరెంట్​గా ప్రజెంట్ చేశారు. మ్యుజిక్​ డైరెక్టర్​ తమన్​, సింగర్​ సిద్ శ్రీరామ్​ సంప్రదాయ దుస్తుల్లో ఈ పాటను రికార్డు చేస్తున్నట్లు చూపించారు. ఇక మహేశ్​ బాబు, కీర్తీ సురేశ్​ల కెమిస్ట్రీని కూడా బాగా చూపించారు. మహేశ్​ బాబు మరింత యంగ్​గా కనిపించారు.

ముందే లీక్​..

అయితే ఈ పాట.. అధికారికంగా విడుదలచేసేందుకు ముందే శనివారం ఆన్​లైన్​లో లీకైంది. లీక్​ వ్యవహారంపై చిత్ర యూనిట్​ ఆందోళన కూడా వ్యక్తం చేసింది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సర్కారు వారి పాట సినిమా గురించి..

ఈ సినిమాలో మహేశ్  బాబు, కీర్తి సురేశ్​, సముద్రకని, వెన్నెల కిశోర్​, సుబ్బరాజు సహా పలువురు నటించారు.

గీత గోవిందం సినిమాతో టాప్ డైరెక్టర్ల సరసన చేరిన పరశురామ్ ఈ సినిమాకు డైరెక్టర్​. మైత్రీ మూవీ మేకర్స్​, 14 రీల్స్ ప్లస్​, జీ మహేశ్ బాబు ఎంటర్​టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా సినిమాను తెరకెక్కిస్తున్నాయి.

నవీన్ యర్నేని, వై. రవి శంకర్​, రామ్​ అచంట, గోపీచంద్ అచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మే 12న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్​ సన్నాహాలు చేస్తోంది.

Also read: SVP Song Leak: 'సర్కారు వారి పాట' సాంగ్ లీక్.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

Also read: Son of India: 'వారి మధ్య ముద్దు సీన్లు'.. మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News