RGV ‘మర్డర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కిస్తోన్న ‘మర్డర్’ సినిమా ట్రైలర్ (MURDER Trailer) వచ్చేసింది

Last Updated : Jul 28, 2020, 09:53 AM IST
RGV ‘మర్డర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..

హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య (Pranay murder) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అలాంటి ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కిస్తోన్న సినిమా ‘మర్డర్’ (MURDER Movie). ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ (MURDER Trailer) వచ్చేసింది. RGV: వర్మపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..కేసు

ముందుగా చెప్పినట్లుగానే దర్శకుడు వర్మ అనుకున్న టైమ్‌కు మర్డర్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను తన ట్విట్టర్ ద్వారా అందించారు. మర్డర్ ట్రైలర్ వీక్షించండి. Bollywood ఇండస్ట్రీలో మరో విషాదం

తన కూతురు అమృత కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించడం తెలిసిందే. ఆపై అమృత న్యాయపోరాటం చేసింది. ఈ క్రమంలో అటు కూతురు దగ్గరికి రాలేదని, పరువు పోయిందని బాధపడుతూ కొంతకాలం కిందట మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. వీటిని తన స్టోరీగా మలుచుకున్నాడు డైరెక్టర్ ఆర్జీవీ. ఈ క్రమంలో మర్డర్ ట్రైలర్ (RGV's MURDER Trailer) రిలీజ్ చేశాడు. నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు

ఆ పరువుహత్య కథాంశంగా తీస్తున్న చిత్రానికి మర్డర్ అనే పేరు పెట్టి.. కుటుంబ కథా చిత్రం అనే క్యాప్షన్‌తో మర్డర్ ఫస్ట్ లుక్ ( Murder movie first look ) రిలీజ్ చేయగా దర్శకుడు వర్మపై  అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వర్మ వీటికి తనదైనశైలిలో బదులిచ్చాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి ‘మర్డర్’ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీఎస్ఆర్ సంగీతం అందిస్తున్నాడు.  బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News