RGV Fires on AP Govt: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఆర్జీవీ ఫైర్.. మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం

RGV Fires on AP GOVT: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధర తగ్గింపు అంశంపై రాష్ట్ర మంత్రి పేర్ని నానికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (ఆర్జీవీ) పలు ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 11:57 AM IST
    • ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఆర్జీవీ ఫైర్
    • ఇదే విషయమై మంత్రి పేర్ని నానిపై ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం
    • చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ స్పందించాలని డిమాండ్
RGV Fires on AP Govt: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఆర్జీవీ ఫైర్.. మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం

RGV Fires on AP GOVT: ఆంధ్రప్రదేశ్ లోని సినిమా టికెట్ ధరలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా టికెట్ ధరలు తగ్గిచడంపై ఇప్పటికే హీరోలు పవన్ కల్యాణ్, నాని, సిద్ధార్థ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు పలువురు నిర్మాతలూ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరాయి. 

దీంతో ఇదే విషయమై టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పుడా సినిమా టికెట్ ధరల తగ్గింపుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించాడు.   

ఇటీవల ఆర్జీవీ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా.. ఇప్పుడు డైరెక్ట్ గా ట్విట్టర్ లో ఏపీ గవర్నమెంట్ కు వరుస ప్రశ్నలు సంధించాడు. "గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని గారూ.." తన ప్రశ్నలకు సదరు మంత్రి కానీ.. లేదా ప్రభుత్వానికి చెందిన ఏ ప్రజాప్రతినిధి అయినా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు.

ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన ప్రశ్నలు

1) సినిమాలు సహా ఏ వుస్తువైనా సరే, దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అసలు ప్రభుత్వం పాత్ర ఏంటి?

2) తీవ్రమైన కొరత ఉన్నప్పుడు గోధుమలు, బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక స్థాయికి మించి పడిపోయినా, పెరిగినా ప్రభుత్వం కలుగజేసుకొని ఆ ధరను సరిదిద్దుతుందని నాకు తెలుసు. కానీ ఇదే రూల్ సినిమాలకు ఎలా వర్తిస్తుంది?

3) ధాన్యం రేట్లయినా సరే బలవంతంగా తగ్గిస్తే రైతుల ఉత్సాహం చచ్చిపోయి కొరత, నాణ్యతాలోపం వెలుగు చూస్తుందనేది ఆర్థిక శాస్త్రంలో ప్రాథమికాంశం. ఇదే సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది కదా.

4) ఒకవేళ సినిమా కూడా పేదవారికి నిత్యావసర వస్తువే అని మీరు భావిస్తే.. ప్రభుత్వం దీన్ని కూడా మెడికల్, ఎడ్యుకేషనల్ సేవల మాదిరిగా చేసినట్లే సబ్సిడైజ్ చేసి మిగతా డబ్బును మీ జేబులో నుంచి ఇవ్వొచ్చు కదా?

5) బియ్యం, పంచదార వంటి వస్తువులను పేదలకు అందించేందుకు రేషన్ షాపులు పెట్టినట్లే.. రేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారా?

6) కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒక స్థాయికి మించి ధరలు పెరిగినా, తగ్గినా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో ఏ పరిస్థితిని ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నారు?

7) ద్వంద్వ ధరల విధానంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించొచ్చేమో. అంటే నిర్మాతలు ఒక ధరకు తమ టికెట్లు అమ్ముకుంటారు. వాటిలో కొన్నింటిని ప్రభుత్వం కొనేసి తక్కువ ధరలను ప్రజలకు అందిస్తుంది. ఇలా చేస్తే మీకు మీ ఓట్లు, మాకు మా డబ్బులు వస్తాయి.

8) అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ధరలను నియంత్రించినా.. ఈ ప్రయత్నం వల్ల కొరత, నాణ్యతాలోపం ఏర్పడతాయనే విషయం చాలాసార్లు రుజువైంది కదా.

9) ఆడమ్ స్మిత్ మార్గదర్శక ఆర్థిక సూత్రాల నుంచి లైసెజ్ ఫెయిర్ సిస్టమ్స్ ప్రబలమైన సిద్ధాంతాల వరకు, ప్రైవేట్ వ్యాపార విషయాలలో ప్రభుత్వ జోక్యం ఎప్పుడూ పని చేయలేదని నిరూపితమైంది.

10) అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల రెమ్యునరేషన్ల ఆధారంగా ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఉంటుంది. వాళ్లకు ఉన్న ట్రాక్ రికార్డు అధారంగా ఎంత కలెక్షన్లు వసూలు చేసేదాన్ని బట్టి వారి పారితోషకాన్ని ఇస్తారు. ఈ విషయాన్ని మీ గౌరవ బృందం అర్థం చేసుకోవాలి.

11) కింది స్థాయి వారి నుంచి అందరికీ న్యాయం చేస్తారని నమ్మి మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కానీ.. మా నెత్తిన కూర్చునేందుకు కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నా. ధన్యవాదాలు.

అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ వ్యాఖ్యలు వాస్తవమేనని కొందరు ట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై టాలీవుడ్ ప్రముఖులందరూ స్పందించాలని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ గళం విప్పారు. "టికెట్ ధరల సమస్యపై తమ మనసులో ఉన్న మాటలను చిత్ర పరిశ్రమలోని నా తోటివారు కూడా మాట్లాడాలని విన్నవించుకోవడం లేదు.. డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పుడూ తెరవలేరు. తర్వాత మీ కర్మ" అంటూ ప్రశ్నల వర్షాన్ని ముగించాడు. 

Also Read: Nidhhi Agerwal Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

Also Read: Ap Cm Ys Jagan: పథకాల్ని అడ్డుకునేవారంతా నిరుపేదల శత్రువులే : వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News