Bigg Boss 6 Telugu Nominations: నామినేషన్స్ షురూ.. డేంజర్ జోన్లో ఏడుగురు.. ఎవరెవరంటే?

Bigg Boss 6 Telugu First Week Nominations:  మొదలై నాలుగు రోజులు కూడా కాకుండనే బిగ్బాస్ సీజన్ 6 మొదటివారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు బిగ్బాస్ నిర్వహకులు.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 8, 2022, 01:00 PM IST
  • మొదలైన బిగ్ బాస్ 6 సందడి
  • మొదటి వారమే ఏడుగురు నామినేషన్స్ లోకి
  • ఎవరెవరు వెళ్ళారంటే?
Bigg Boss 6 Telugu Nominations: నామినేషన్స్ షురూ.. డేంజర్ జోన్లో ఏడుగురు.. ఎవరెవరంటే?

Bigg Boss 6 Telugu First Week Nominations:  ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్బాస్ సీజన్ 6 ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మొదలై నాలుగు రోజులు కూడా కాకుండనే మొదటివారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు బిగ్బాస్ నిర్వహకులు. ఒక్కో బిగ్ బాస్ కంటెస్టెంట్ మరో ఇద్దరి కంటెస్టెంట్ల పేర్లను నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసే కంటెస్టెంట్ పేర్లను ఫ్లష్ ట్యాంక్ లో వేసి దానికి గల కారణాలు కూడా చెప్పాలని పేర్కొన్నారు.

ముందుగా ఈ నామినేషన్ టాస్క్ ని సింగర్ రేవంత్ ప్రారంభించాడు. ఆయన ఫైమా, ఆరోహి ఇద్దరినీ నామినేట్ చేశాడు. పైమా ఆరోహి ఇంట్లో ఎలాంటి పనులు చేయడం లేదని అదే తన కారణంగా చెప్పుకొచ్చాడు. తర్వాత సుదీప రేవంత్, చంటి ఇద్దరినీ నామినేట్ చేసింది. రేవంత్ తప్పు చేసినా తనదే కరెక్ట్ అని వాదించడం కరెక్ట్ గా లేదని ఆమె పేర్కొంది. రేవంత్ కూడా ఎక్కడా తగ్గకుండా ఆమెతో వాదించే ప్రయత్నం చేశాడు. అయితే చంటి మాత్రం టాస్కులలో సరిగా ఇన్వాల్వ్ కావడం లేదని చెప్పడంతో సైలెంట్ గా ఉండిపోయాడు.

తర్వాత ఫైమా కూడా రేవంత్, రేవంత్ తో పాటు అర్జున్ కళ్యాన్ ఇద్దరినీ నామినేట్ చేసి రేవంత్ మాటకారి అని చెబుతూ నామినేషన్ కు గల కారణాన్ని వెల్లడించింది.   తర్వాత వాసంతి వచ్చి రేవంత్, శ్రీ సత్య ఇద్దరిని నామినేట్ చేసింది. శ్రీ సత్య ఆటిట్యూడ్ చూపిస్తుందని తన కారణంగా ఆమె చెప్పింది. ఇక అర్జున్ క‌ళ్యాణ్‌...ఫైమా, అరోహిల‌ను నామినేట్ చేసాడు. అలాగే అరోహి కూడా రేవంత్‌ను నామినేట్ చేసింది. 

రోహిత్‌, మ‌రీనా ఇద్ద‌రు ఒకే కంటెస్టట్ గా లెక్కిస్తారని చెప్పి షాకిచ్చాడు. వారిద్దరూ కలిసి చంటి ఫైమా ఇద్దరినీ నామినేట్ చేశారు. ఆ తర్వాత ఆరోహి కూడా తనమీద బాడీ షేవింగ్ చేసిందని మ‌రీనా పేర్కొంది. ఆ తరువాత శ్రీహాన్, చంటి, సూర్య కూడా రేవంత్ నే నామినేట్ చేశారు. రేవంత్ మాట్లాడే తీరు బాగోలేదని ఎక్కువమంది ఒకే రీజన్  చెప్పారు. ఇలా మొత్తం మొదటి వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది నామినేట్ చేయడంతో రేవంత్ నామినేషన్ లో టాప్ ప్లేస్ లో నిలవగా మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయినట్లు బిగ్ బాస్ పేర్కొన్నాడు.

వారిలో చంటి, శ్రీ సత్య, ఫైమా నామినేట్ అవ్వగా అంతకుముందే ట్రాష్ సభ్యులుగా ఉన్న ఇనయా సుల్తానా, అభినయశ్రీ, ఆదిరెడ్డి కూడా నామినేషన్తో నిలిచినట్టు పేర్కొన్నాడు. మొత్తం మీద ఈ వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Boycott Brahmastra : రిలీజ్ కు ముందు బాయ్ కాట్ టెన్షన్.. నెటిజన్లు చెబుతున్న కారణాలివే!

Also Read: Bandi Sanjay Clarity on Jr Ntr Meeting: ఆరోజు అసలు జరిగింది ఇదే.. నేను అక్కడే ఉన్నా.. అసలు విషయం చెప్పేసిన బండి సంజయ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News